Ola Electric Scooter: ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ చాలా ఖరీదు.. కొత్త మోడల్‌ ధర ఎంతంటే..?

|

May 22, 2022 | 9:09 PM

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ వినియోగదారులకి షాక్‌ ఇచ్చింది. ఓలా ఎస్1 ప్రో ధరను పెంచింది. ఇప్పుడు ఈ-స్కూటర్‌ను

Ola Electric Scooter: ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ చాలా ఖరీదు.. కొత్త మోడల్‌ ధర ఎంతంటే..?
Ola S1
Follow us on

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ వినియోగదారులకి షాక్‌ ఇచ్చింది. ఓలా ఎస్1 ప్రో ధరను పెంచింది. ఇప్పుడు ఈ-స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి మరో 10 వేలు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు FAME II సబ్సిడీని తొలగించిన తర్వాత దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.29 లక్షలుగా ఉండేది. ఇప్పుడు అది రూ. 1.39 లక్షలకు పెరిగింది. ఓలా ఎస్1 ప్రో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ-స్కూటర్ అని అందరికి తెలిసిందే. మార్చిలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను పెంచాలని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో సూచించారు. దీని తర్వాత Ola S1 ప్రో బుకింగ్‌ను పునఃప్రారంభిస్తున్నప్పుడు కంపెనీ ధరను 10 వేల రూపాయలు పెంచింది. అదే సమయంలో Ola త్వరలో MoveOS 2 OS స్కూటర్లని విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో బుక్ చేసుకున్న వినియోగదారులకు కూడా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీ నిర్ణయం ప్రకారం జనవరిలో బుకింగ్ చేసుకునే కస్టమర్లు కూడా కొత్త ధరను చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో తాజా బుకింగ్ S1 ప్రో కోసం మాత్రమే ఓపెన్ చేశారు.

Ola S1 ప్రో స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే.. ఈ కొత్త స్కూటర్ పది రంగులలో వస్తుంది. Ola S1 ప్రో అనేది కంపెనీ S1 మోడల్ ప్రీమియం వేరియంట్. S1 ప్రో మోటార్ 5500 W శక్తిని ఇస్తుంది. వినియోగదారులు S1 ప్రో రెండు చక్రాలలో డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. S1 ప్రో గరిష్ట వేగం 115kmph అని కంపెనీ పేర్కొంది. Ola S1 ప్రో ఈ-స్కూటర్ క్రూయిజ్ కంట్రోల్, హిల్-హోల్డ్ సిస్టమ్, వాయిస్ అసిస్ట్ అంటూ మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. S1 ప్రో బ్యాటరీ ఆరున్నర గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లి క్ చేయండి