Telegram: గ్రూప్‌ వీడియో కాల్‌లో మరో సంచలనం.. అద్భుత ఫీచర్‌ను పరిచయం చేసిన టెలిగ్రామ్‌. ఇదే కాదు ఇంతకు మించి కూడా..

|

Aug 02, 2021 | 3:08 PM

Telegram New Feature: కరోనా కారణంగా వర్క్‌ కల్చర్‌తో పాటు విద్యా విధానంలో సంపూర్ణ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కేవలం కొంత మందికి మాత్రమే పరిమితమైన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది . ఈ క్రమంలోనే...

Telegram: గ్రూప్‌ వీడియో కాల్‌లో మరో సంచలనం.. అద్భుత ఫీచర్‌ను పరిచయం చేసిన టెలిగ్రామ్‌. ఇదే కాదు ఇంతకు మించి కూడా..
Telegram
Follow us on

Telegram New Feature: కరోనా కారణంగా వర్క్‌ కల్చర్‌తో పాటు విద్యా విధానంలో సంపూర్ణ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కేవలం కొంత మందికి మాత్రమే పరిమితమైన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది . ఈ క్రమంలోనే వీడియో కాల్స్‌ అనివార్యంగా మారాయి. టీమ్‌ సభ్యులు ప్రాజెక్టు గురించి మాట్లాడుకోవాలన్నా, విద్యార్థులు పాఠాలు వినాలన్నా వీడియో కాల్స్‌ తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలోనే మెసేజింగ్‌ యాప్‌లు సైతం వీడియో కాల్స్‌ ఫీచర్‌కు మరిన్ని మెరుగులు దిద్దుతున్నాయి. ఇందులో భాగంగానే టెలిగ్రామ్‌ తాజాగా గ్రూప్‌ వీడియా కాల్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీడియా కాల్స్‌ కోసం ప్రత్యేకంగా.. నాయిస్ స‌స్పెన్షన్‌, యానిమేటేడ్ బ్యాంక్‌గ్రౌండ్‌తో పాటు స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను అందించింది.

అయితే తాజాగా గ్రూప్‌ కాల్స్‌ ఫీచర్‌కు మరో అద్భుత ఆప్షన్‌ను జోడించింది. ఇక నుంచి టెలిగ్రామ్‌లో ఒకేసారి వెయ్యి మంది గ్రూప్‌ కాల్స్‌లో జాయిన్‌ అయ్యే అవకాశాన్ని కల్పించారు. 30 మంది యూజర్లు తమ మొబైల్‌ ఫోన్ నుంచి వీడియోను బ్రాడ్‌కాస్టింగ్‌ చేయొచ్చని తెలిపిన కంపెనీ.. వెయ్యి మంది ఏక కాలంలో లైవ్‌ స్ట్రీమింగ్‌ను వీక్షించే అవకాశం ఉందని వివరించింది. కరోనా పాండమిక్‌ సమయంలో ఈ లెర్నింగ్‌ను మరింత సులువుగా మార్చేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు టెలిగ్రామ్‌ తెలిపింది. టెలిగ్రామ్‌ గ్రూప్‌ అడ్మిన్‌ ఎవరైనా వీడియో కాల్ ప్రారంభించాలంటే ముందుగా.. ఇన్‌ఫో పేజ్‌లో వాయిస్‌ చాట్‌ను పంపించాల్సి ఉంటుంది. అనంతరం వీడియో ఆన్‌ అవుతుంది. అంతేకాకుండా యూజర్లు గ్యాలరీలోని వీడియోలను కాకుండా నేరుగా ఫోన్‌ ద్వారా చిత్రీకరించి.. షేర్‌ చేసే ఫీచర్‌ను కూడా అందించింది. టెలిగ్రామ్‌ ఈ ఫీచర్‌ను స్నాప్‌చాట్‌ నుంచి ప్రేరణ పొంది తీసుకొచ్చింది. వీటితో పాటు టెలిగ్రామ్‌ ఆటో డిలీట్‌ ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది. దీని ద్వారా.. యూజర్లు నెల వరకు టైమ్‌ సెట్ చేసుకునే అవకాశం ఉంది. యూజర్‌ సెట్ చేసుకున్న సమయానికి మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్‌ అయ్యేలా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇక యూజర్లు మాట్లాడుతున్న సమయంలో డివైజ్‌లోని పాటలను లేదా మ్యూజిక్‌ను జోడించే అవకాశాన్ని కూడా అందించారు. వీటితో పాటు ఫొటోలను, వీడియోలను పంపించే సమయంలో వాటికి అదనంగా టెక్స్ట్‌, స్టిక్కర్స్‌తో పాటు డ్రాయింగ్స్‌ను కూడా యాడ్‌ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో వినూత్న ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే పనిలో పడింది టెలిగ్రామ్‌.

Also Read: Apple Users Alert: యూపిల్‌ యూజర్లకు అలర్ట్‌.. వీటిని వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి.. ఇకపోతే ఇబ్బందులే..!

Redmi 9c: రూ.9వేలలోపే రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌.. 128జీబీ స్టోరేజీ.. అద్భుతమైన ఫీచర్స్‌

Infinix Smart 5A: ఇన్‌ఫినిక్స్ నుంచి మరో మొబైల్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో నేడు విడుదల.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..!