Tech Tips: మీ ఫోన్ అకస్మాత్తుగా నీటిలో పడిపోయిందా? నో టెన్షన్.. ఇలా చేయండి

Tech Tips: ఈ సమయంలో మీరు మీ ఫోన్‌ను ఛార్జ్ చేయకూడదు. దీని వలన షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు. దీని వలన నీరు మరింత లోపలికి చొచ్చుకుపోయే అవకాశం ఉంది. వేడి గాలి ఫోన్ సర్క్యూట్రీని దెబ్బతీస్తుంది. మీరు 24 గంటలు..

Tech Tips: మీ ఫోన్ అకస్మాత్తుగా నీటిలో పడిపోయిందా? నో టెన్షన్.. ఇలా చేయండి

Updated on: Nov 19, 2025 | 8:30 AM

Tech Tips: ఈ రోజుల్లో దాదాపు అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. కానీ ఎవరికి ఎప్పుడు సమస్య వస్తుందో ఎవరూ చెప్పలేం. కొన్నిసార్లు మొబైల్ ఫోన్లు అకస్మాత్తుగా నీటిలో పడవచ్చు. ఇది చాలా మందికి జరుగుతుంది. కొన్నిసార్లు అది టాయిలెట్‌లో పడిపోతుంది. కొన్నిసార్లు వీధిలోని నీటిలో పడిపోతుంది. అలాంటి సమయంలో టెన్షన్‌ పడిపోతుంటాము.

మరి మీ ఫోన్ నీటిలో పడితే ఏం చేయాలి?

కొత్త ఫోన్ కొనే ముందు లేదా మరమ్మతు కోసం సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లే ముందు మీరు అనుసరించగల కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

మీ మొబైల్‌లో నీరు పోతే ఏమి చేయాలి?

  • ఫోన్ లోకి నీరు చేరితే వెంటనే దాన్ని ఆఫ్ చేయండి. ఇది షార్ట్ సర్క్యూట్ సమస్యలను నివారిస్తుంది.
  • ఫోన్‌లోని సిమ్ కార్డ్, మెమరీ కార్డ్, వెనుక కవర్, మొదలైనవి తీసివేయండి.
  • ఫోన్‌ను మెత్తటి గుడ్డ లేదా టిష్యూ పేపర్‌తో తుడవండి. ఛార్జింగ్ పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, స్పీకర్లు వంటి భాగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

అప్పుడు ఏం చేయాలి?

ఫోన్‌ను పూర్తిగా తుడిచి బియ్యం గిన్నెలో ఉంచండి. బియ్యం పాత్రలోకి గాలి రాకుండా చూసుకోండి. అలాగే, ఫోన్‌ను బియ్యంలో 24 నుండి 48 గంటలు ఉంచండి. బియ్యం తేమను గ్రహిస్తుంది. ఫోన్ ఎండిపోవడానికి సహాయపడుతుంది. మీరు ఫోన్‌ను సిలికా జెల్ ప్యాకెట్‌లో ఉంచవచ్చు. ఇది నీటిని పీల్చుకోవడంలో సహాయపడుతుంది. అదనంగా ఫోన్‌ను నేరుగా ఫ్యాన్ కింద ఆరనివ్వండి.

ఏం చేయకూడదు:

ఈ సమయంలో మీరు మీ ఫోన్‌ను ఛార్జ్ చేయకూడదు. దీని వలన షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు. దీని వలన నీరు మరింత లోపలికి చొచ్చుకుపోయే అవకాశం ఉంది. వేడి గాలి ఫోన్ సర్క్యూట్రీని దెబ్బతీస్తుంది.

మీరు 24 గంటలు లేదా 48 గంటల తర్వాత ఫోన్‌ను ఆన్ చేయవచ్చు. డిస్‌ప్లే, సౌండ్, కెమెరా, ఛార్జింగ్ మొదలైనవి సరిగ్గా పనిచేస్తుంటే ఫోన్ బాగానే ఉంది. ఫోన్ ఆన్ కాకపోతే లేదా స్క్రీన్ నల్లగా ఉంటే సర్వీస్ సెంటర్‌కు వెళ్లండి.

ఇది కూడా చదవండి: SBI నుండి రూ. 60 లక్షల గృహ రుణం తీసుకోవడానికి మీ జీతం ఎంత ఉండాలి. EMI ఎంత?

ఇది కూడా చదవండి: Best Bikes: భారత్‌లో 5 చౌకైన బైక్‌లు ఇవే.. రూ. 55,000 నుండి ప్రారంభం!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి