
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించని వారంటూ ఉండరేమో. అయితే నలుపు లేదా తెలుపు ఛార్జర్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో, చాలా కంపెనీలు ఫోన్‌తో తెల్లటి ఛార్జర్‌ను అందిస్తున్నాయి. ఈ ఛార్జర్ రోజువారీ వాడకంతో మురికిగా, నల్లగా మారుతుంటాయి. మీరు ఛార్జర్‌ను ఎంత శుభ్రంగా ఉపయోగించినా, తెల్లటి ఛార్జర్‌పై మురికి పేరుకుపోతుంది. క్రమంగా దాని రంగు నల్లగా మారడం ప్రారంభమవుతుంది. అయితే మీరు ఈ మురికి డేటా కేబుల్, అడాప్టర్‌ను మునుపటిలా తెల్లగా మెరిసేలా చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: PAN Card: పాన్ కార్డు ఉన్నవారికి అలర్ట్.. ఇది చేయకపోతే రూ.10 వేల జరిమానా!
బేకింగ్ సోడా: ఛార్జర్ శుభ్రం చేయడానికి 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకోండి. దానికి రెండు చుక్కల నిమ్మరసం, కొద్దిగా నీరు వేసి, ఆ మిశ్రమాన్ని స్పాంజిపై అప్లై చేసి, ఆపై మీ ఛార్జర్ చుట్టూ సున్నితంగా తుడవండి. మీ ఛార్జర్‌లోని మురికి అంతా స్పాంజ్‌కు అంటుకుంటుంది. దీంతో ఛార్జర్ మునుపటిలాగే శుభ్రంగా మెరిసిపోతుంది. ఈ మిశ్రమంతో శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్న గుడ్డతో ఛార్జర్‌ను పూర్తిగా శుభ్రం చేయండి.
నిమ్మ తొక్క: మీ నలుపు లేదా మురికి ఛార్జర్‌ను తిరిగి తెల్లగా మార్చాలనుకుంటే, ఒక నిమ్మకాయ తీసుకొని దాని రసాన్ని మొత్తం పిండండి. ఆపై తొక్కను మీ ఛార్జర్‌పై రుద్దండి. అలా చేయడం వల్ల ఛార్జర్‌లోని ఏదైన మురికి తొలగిపోతుంది. తర్వాత కొద్దిగా తడిగా ఉన్న గుడ్డతో ఛార్జర్‌ను శుభ్రంగా తుడవండి.
వెనిగర్: ఇది కూడా ఒక ప్రభావవంతమైన ఉపాయం. దీని కోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ తీసుకొని ఆ తరువాత వెనిగర్ లో ఒక గుడ్డను ముంచి, ఛార్జర్‌ను సున్నితంగా తుడవండి. తరువాత కొద్దిగా తడిగా ఉన్న వస్త్రంతో తుడవండి. అప్పుడు మీ ఛార్జర్ మునుపటిలాగే శుభ్రంగా కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: LIC Scheme: ప్రతి రోజు రూ.150 పెట్టుబడి పెట్టండి.. రూ.19 లక్షలు పొందండి.. అద్భుతమైన స్కీమ్!
ఛార్జర్ ఎందుకు తెల్లగా ఉంది?
నేడు చాలా కంపెనీలు తమ మొబైల్ ఫోన్‌లతో పాటు తెల్లటి ఛార్జర్‌లను అందిస్తున్నాయి. తెల్లటి ఛార్జర్‌ను ఉపయోగించడానికి మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది తెలుపు రంగు ఛార్జర్‌లోకి వేడి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. తెలుపు రంగు ఎక్కువ ఉష్ణ శక్తిని ప్రతిబింబిస్తుంది. తక్కువ ఉష్ణ శక్తిని గ్రహిస్తుంది. దీని కారణంగా ఛార్జర్ తక్కువగా వేడెక్కుతుంది.
నల్లటి ఛార్జర్లతో ఉన్న సమస్య ఏమిటంటే, రాత్రి చీకటిలో వాటిని కనుగొనడం కష్టం. అదే తెల్లటి ఛార్జర్ చీకటిలో కూడా సులభంగా కనిపిస్తుంది. తెలుపు అనేది సౌమ్యతకు చిహ్నం, అందరూ ఇష్టపడతారు. అందుకే ఇప్పుడు కంపెనీలు మరిన్ని తెల్లటి ఛార్జర్‌లను తయారు చేయడం ప్రారంభించాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి