Tech Tips: మీ ఫోన్‌లో నీరు చేరితే బియ్యంలో ఉంచుతున్నారా? ఆపిల్‌ కంపెనీ చెప్పిందేమిటి?

Tech Tips: తరచుగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్ తడిసినప్పుడు ఆరబెట్టడానికి బియ్యంలో పెడతారు. దీని వెనుక ఉన్న ఏకైక కారణం ఏమిటంటే, బియ్యం ఫోన్‌లోని నీటిని పీల్చుకుంటుంది. దీని వల్ల ఫోన్‌ రిపేర్ సులభంగా అయిపోతుందని భావిస్తుంటారు. కానీ ఆపిల్ కంపెనీ..

Tech Tips: మీ ఫోన్‌లో నీరు చేరితే బియ్యంలో ఉంచుతున్నారా? ఆపిల్‌ కంపెనీ చెప్పిందేమిటి?

Updated on: Feb 26, 2025 | 3:42 PM

చాలా మంది ఫోన్లు నీటితో పడుతుంటాయి. అలాంటి సమయంలో కొందరు ఫోన్‌ను వెంటనే బియ్యంలో ఉంచుతారు. దీని వల్ల నీరు త్వరగా ఆవిరైపోతుందని భావిస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఈ ట్రిక్ తర్వాత కొంతమంది ఫోన్లు ఆన్ అవుతాయి. కానీ కొంతమంది ఫోన్లు సరిగ్గా పనిచేయవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆపిల్ కంపెనీ కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. దీనితో మీరు మీ ఫోన్ దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.

ఇది చాలా ప్రమాదకరమంటున్న ఆపిల్:

తరచుగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్ తడిసినప్పుడు ఆరబెట్టడానికి బియ్యంలో పెడతారు. దీని వెనుక ఉన్న ఏకైక కారణం ఏమిటంటే, బియ్యం ఫోన్‌లోని నీటిని పీల్చుకుంటుంది. దీని వల్ల ఫోన్‌ రిపేర్ సులభంగా అయిపోతుందని భావిస్తుంటారు. కానీ ఆపిల్ కంపెనీ దీనిని ప్రమాదకరమైన పద్ధతిగా పేర్కొంది. దీని వల్ల మీ ఫోన్‌కు భారీ నష్టం వాటిల్లుతుందని ఆపిల్ కంపెనీ తెలిపింది. దీనిపై ఆపిల్ తన వెబ్‌సైట్‌లో తడిసిన ఐఫోన్‌ను బియ్యంలో పెట్టడం వల్ల చాలా హానికరం అని పేర్కొంది. ఎందుకంటే చిన్న బియ్యం ముక్కలు ఫోన్ లోపలికి వెళ్లి దెబ్బతింటాయని చెబుతోంది.

ఆపిల్ కొత్త ఫీచర్:

ఇటీవల ఆపిల్ కూడా ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని కారణంగా ఫోన్‌లోకి నీరు చేరితే అది ఆటోమేటిక్‌గా మీకు తెలియజేస్తుంది. అంతేకాకుండా, ఫోన్‌లో నీరు ఉంటే, ఆపిల్ ఫోన్ ఫోన్ పూర్తిగా ఆరిపోయే వరకు దానిని ఛార్జ్ చేయడానికి నిరాకరిస్తుంది.

ఫోన్, ఛార్జింగ్ కేబుల్:

ముందుగా మీ ఫోన్, ఛార్జింగ్ కేబుల్ పూర్తిగా ఆరిపోయే వరకు కనెక్ట్ చేయకూడదని ఆపిల్ చెప్పింది. దీనితో పాటు ఐఫోన్‌ను ఆరబెట్టడానికి, దానిని క్రిందికి వంచి, చేతితో సున్నితంగా తట్టాలి. తద్వారా ఫోన్‌లో ఉన్న నీరు బయటకు వస్తుంది. మీరు ఫోన్‌ను వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచవచ్చు. ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత కూడా ఫోన్‌లో హెచ్చరిక సందేశం వస్తుంటే. ఛార్జింగ్ పోర్ట్ లేదా కేబుల్ పిన్ ఇంకా నీటితో నిండి ఉందని అర్థం.

ఈ వస్తువులను వాడకండి..

మీ ఫోన్‌ను ఆరబెట్టడానికి మీరు ఎప్పుడూ హీటర్, హెయిర్ డ్రైయర్ లేదా ఎయిర్ బ్లోవర్‌ను ఉపయోగించకూడదు. ఇది మాత్రమే కాదు, ఛార్జింగ్ పోర్టులో కాటన్ లేదా టిష్యూ పేపర్ వంటి ఏదైనా వస్తువును ఉంచడం కూడా సరైనది కాదు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి