Google Pixel 6 : అదిరిపోయే లుక్స్‌తో గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

| Edited By: Ravi Kiran

Aug 31, 2021 | 6:50 AM

Google Pixel 6 : గూగుల్ తన సొంత ఎస్‌వోసీ, టెన్సార్ ప్రాసెస‌ర్‌తో తయారు చేసిన పిక్సెల్ 6 సిరీస్ మోడల్ స్మార్ట్ ఫోన్లను..

Google Pixel 6 : అదిరిపోయే లుక్స్‌తో గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
Google Pixel
Follow us on

Google Pixel 6 : గూగుల్ తన సొంత ఎస్‌వోసీ, టెన్సార్ ప్రాసెస‌ర్‌తో తయారు చేసిన పిక్సెల్ 6 సిరీస్ మోడల్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఈ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తామంటూ తాజాగా ప్రకటించింది. అయితే, దీనికి సంబంధించి ఖచ్చితమైన వివరాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ.. తాజాగా కీలక అప్‌డేట్స్ లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్‌ల రిలీజ్ డేట్, ధర, ఫీచర్లు వంటి వివరాలను అనధికారికంగా నెట్టింట్లో సర్క్యూలేట్ అవుతున్నాయి. మరి పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి లీక్ అయిన వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ల యుగంలో కస్టమర్లకు అభిరుచికి తగ్గట్లుగా, ప్రస్తుత అవసరకు సరిపోయే విధంగా సరికొత్త ఫీచర్లు, టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. ఈ నేపథ్యంలోనే ఫెస్టివల్ సీజన్ అయిన సెప్టెంబర్ మాసంలో చాలా మొబైల్ కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ కూడా తన పిక్సెల్ 6 సిరీస్ మొబైల్ ఫోన్లను కూడా సెప్టెంబర్‌లోనే విడుదల చేయాలని భావిస్తోందట. ముఖ్యంగా.. మగతా స్మార్ట్ ఫోన్ కంపెనీల కంటే ముందే.. తన ఫోన్లను రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ చేస్తోందట.

ఇదిలాఉంటే.. గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లకు సంబంధించి పలు స్పెఫికేషన్లు లీక్ అయ్యాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో నడిచే ఈ స్మార్ట్‌ ఫోన్లు.. డ్యూయల్ టోన్ డిజైన్, బ్యాక్ పానెల్‌లో కెమెరా బార్, డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్‌(పిక్సెల్ 6), ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌(పిక్సెల్ 6 ప్రో) లాంటి ఫీచ‌ర్లు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

Also read:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన గోల్డ్‌ రేటు.. తాజా ధరల వివరాలు

Rains Alerts: తెలంగాణలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

AP-TS Weather Alert: అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్..