ఎవరైనా ఫోన్ కొనుగోలు చేస్తే.. ఆ బాక్స్‌లో ఫోన్, పౌచ్, స్క్రీన్ గార్డ్, ఛార్జింగ్ కేబుల్, అడాప్టర్, యూఎస్‌బీ కేబుల్, సిమ్ ఎజెక్టర్ వంటివి వస్తాయి. అయితే, గత కొంతకాలంగా కంపెనీలు.. ఫోన్ వెంట చార్జర్లను ఇవ్వడం నిలిపివేస్తున్నాయి. దాంతో కస్టమర్లు స్మార్ట్ ఫోన్‌తో పాటు.. ఛార్జర్‌ను కూడా విడిగా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఫోన్‌కు వేర్వేరు ఛార్జర్‌లను కొనుక్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, ఖర్చు తగ్గించే అద్భుతమైన గ్యాడ్జెట్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ప్రముఖ ఎలక్ట్రానిక్ డివైజ్ మేకర్ కంపెనీ ‘బోట్’ సరికొత్త వైర్‌లెస్ ఛార్జర్‌ను తీసుకువచ్చింది.
ఫ్లోట్‌పాడ్ 300(Floatpad 300) పేరుతో బోట్ సరికొత్త వైర్‌లెస్ ఛార్జర్‌ను తీసుకువచ్చింది. ఈ వైర్‌లెస్ ఛార్జర్ ధర రూ. 999 గా నిర్ణయించింది. ఈ కామర్స్ సైట్స్‌లో దీనిని బ్యాంక్ ఆఫర్స్ కింద మరింత చౌకగా కొనుగోలు చేయొచ్చు. ఛార్జింగ్ విషయంలో ఇబ్బందిగా ఫీలవుతున్న వినియోగదారులకు ఈ వైర్‌లెస్ ఛార్జర్ మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. పైగా దీనితో పాటు.. వినియోగదారులకు టైప్ సి కేబుట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సరం వారంటీ కూడా ఇస్తోంది కంపెనీ.
క్వాలిటీ పరంగా ఫ్లోట్ ప్యాడ్ 300 గ్రేట్ డివైజ్ అని కస్టమర్స్ రేటింగ్ ఇస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఛార్జర్ డిజైన్ బ్యూటీఫుల్‌గా ఉంది. Floatpad 300 వైర్‌లెస్ అవుట్‌పుట్ 5W, 7.5W, 10W, 15W మధ్య ఉంటుంది.
ఇది Qi సర్టిఫైడ్ పరికరం. ఇది భద్రత పరంగా ఫర్‌ఫెక్ట్ అని చెప్పొచ్చు. Floatpad 300లో అంతర్నిర్మిత స్మార్ట్ IC రక్షణ ఉంది. అంటే ఓవర్ ఛార్జింగ్ వల్ల మొబైల్ ఫోన్ కు ఎలాంటి హానీ ఉండదు. అదేవిధంగా, బోట్ ‘ఫ్లోట్‌ప్యాడ్ 350’ పేరుతో మరో వైర్‌లెస్ ఛార్జర్‌ను పరిచయం చేసింది. ఈ వైర్‌లెస్ ఛార్జర్ ధర రూ.1,099. బోట్ నుండి ఈ వైర్‌లెస్ ఛార్జర్ 12 లేయర్ స్మార్ట్ IC రక్షణను కలిగి ఉంది, ఇది పరికరాన్ని షార్ట్ సర్క్యూట్ నుండి రక్షిస్తుంది. దీంతో పాటు, వినియోగదారులకు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇవ్వబడుతుంది.
గమనిక: బోట్ కంపెనీ తెలిపిన వివరాలను పైన వ్యాసంలో ఇవ్వడం జరిగింది. వైర్‌లెస్ ఛార్జర్‌ను కొనుగోలు చేసే ముందు పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..