Whatsapp Update: వాట్సాప్‌లో సూపర్‌ అప్‌డేట్‌.. మెసేజ్‌తో పాటు గ్రూప్‌ క్రియేట్‌ ఆప్షన్‌

వాట్సాప్‌ కూడా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ వినియోగదారులను అలరిస్తుంది. తాజాగా ఓ సరికొత్త అప్‌డేట్‌తో మన ముందుకు వచ్చింది. ఆ అప్‌డేట్‌ వివరాలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.

Whatsapp Update: వాట్సాప్‌లో సూపర్‌ అప్‌డేట్‌.. మెసేజ్‌తో పాటు గ్రూప్‌ క్రియేట్‌ ఆప్షన్‌
Whatsapp

Updated on: Jul 28, 2023 | 8:00 PM

భారతదేశంలో యువత ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్‌ ఫోన్స్‌లో ఎక్కువగా వాట్సాప్‌ను విరివిగా వాడుతున్నారు. వాట్సాప్‌లో ఎక్కువగా ఆడియో, వీడియో మెసేజ్‌లను పంపడంతో పాటు వీడియో, ఆడియో, స్టేటస్‌ పెట్టుకునే ఆప్షన్లు యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌లో గ్రూప్స్‌ పెట్టుకుని సంభాషణ చేసుకునే అవకాశం ఉండడంతో చాలా మంది వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలకు గ్రూప్స్‌ పెట్టుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి ఒక్క అవసరానికి వాట్సాప్‌ తప్పనిసరైంది. వాట్సాప్‌ లేని ఫోన్‌ ఉండడం లేదంటే అతిశయోక్తి కాదు. కొన్ని కొన్ని కంపెనీ ఫోన్స్‌లో అయితే వాట్సాప్‌ను డిఫాల్ట్‌ యాప్‌గా పరిచయం చేస్తున్నారు. వాట్సాప్‌ కూడా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ వినియోగదారులను అలరిస్తుంది. తాజాగా ఓ సరికొత్త అప్‌డేట్‌తో మన ముందుకు వచ్చింది. ఆ అప్‌డేట్‌ వివరాలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.

మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ ప్రస్తుతం మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసే సమయంలోనే గ్రూప్‌ క్రియేట్‌ చేసుకునే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ ఫీచర్‌ వల్ల వినియోగదారులు చాలా సులభంగా ఇతరులతో తమ మెసేజ్‌లను ఫార్వార్డ్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ తాజా ఫీచర్‌ బీటా వెర్షన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలో సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ తాజా అప్‌డేట్‌ భద్రతా నోటిఫికేసన్‌ స్క్రీన్‌ కోసం కొత్త లే అవుట్‌ వంటి యూఐ అప్‌గ్రేడ్‌లను అన్వేషించడానికి ఎక్కువ మంది వినియోగదారులను అనుమతిస్తుంది. ప్రస్తుతం బీటా టెస్టర్లకు ఈ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వ్యాపార సంబంధిత సంభాషణలు చేసే వారికి ఈ నయా ఫీచర్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది. నిర్ధష్ట సందేశాలు, సందర్భాలు, ఈవెంట్‌ల ఆధారంగా గ్రూప్స్‌ క్రియేట్‌ చేసే వారికి ఈ ఫీచర్‌ అనువుగా ఉంటుంది. ఉదాహరణకు మీరు స్నేహితులకు సినిమా ప్లాన్‌ చేస్తుంటే కేవలం సినిమాకు వెళ్లే వారిని సెలెక్ట్‌ చేసుకుని సింపుల్‌గా గ్రూప్‌ ‍క్రియేట్‌ చేసుకోవచ్చు. కాబట్టి తాజా అప్‌డేటేడ్‌ ఫీచర్‌ త్వరలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..