Whatsapp: అప్‌డేట్స్‌ విషయంలో తగ్గేదేలే అంటోన్న వాట్సాప్‌.. మరికొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్‌..

|

Oct 28, 2022 | 5:41 PM

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మారుతోన్న అవసరాలకు అనుగుణంగా, యూజర్ల అవసరాలకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడమే..

Whatsapp: అప్‌డేట్స్‌ విషయంలో తగ్గేదేలే అంటోన్న వాట్సాప్‌.. మరికొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్‌..
Whatsapp New Feature
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మారుతోన్న అవసరాలకు అనుగుణంగా, యూజర్ల అవసరాలకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడమే వాట్సాప్‌కు ఇంతటీ క్రేజ్‌ దక్కడానికి కారణంగా చెప్పొచ్చు. ఇప్పటికే వరుసగా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ను పరయిం చేస్తూ వస్తోన్న వాట్సాప్‌ తాజాగా మరికొన్ని ఫీచర్లను తీసుకొస్తోంది. సాధారణంగా వాట్సాప్‌లో ఫొటో లేదా వీడియోతో పాటు ఏదైనా టెక్స్ట్‌ వస్తే.. ఆ రెండింటిన్‌ ఒకేసారి ఫార్వర్డ్‌ చేయడం కుదరదు. అయితే దీనికి చెక్‌ పెట్టేందుకు వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌ తీసుకొస్తోంది.

త్వరలోనే ఇమేజ్‌ లేదా వీడియోతోపాటు టెక్ట్స్‌ను ఒకేసారి ఫార్వర్డ్‌ చేసే వీలు కల్పించనున్నారు. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను కొందరు యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో టెస్టింగ్‌ అయ్యాక అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక వాట్సాప్‌ తీసుకు రానున్న మరో ఫీచర్‌ ఇమేజ్‌ను బ్లర్‌ చేసుకునే అవకాశం. సాధారణంగా మనం ఎదుటి వ్యక్తి ఏదైనా ఫొటో పంపించే సమయంలో సదరు ఫొటోలో కొన్ని దృశ్యాలు కనిపించకూడదనుకుంటే ఏం చేస్తాం. సెపరేట్‌ యాప్‌లో ఇమేజ్‌ను బ్లర్‌ చేస్తాం.

అయితే ఇకపై ఆ అవసరం లేకుండా నేరుగా వాట్సాప్‌లో పంపించే సమయంలోనే ఇమేజ్‌ను బ్లర్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఫొటోను పంపించే సమయంలోనే బ్లర్‌ చేసి అవతలి వ్యక్తికి పంపించొచ్చు. ఇక వాట్సాప్‌ తెస్తున్న మరో ఫీచర్‌.. గ్రూపుల్లో ఇప్పటివరకు ఎవరైన మెసేజ్‌ చేస్తే వారు నెంబర్‌ లేదా మీరు ఫోన్‌లో సేవ్‌ చేసుకున్న వారి పేర్లు కనిపించేవాయి. అయితే ఇకపై వారి డిపీ (డిస్‌ప్లే పిక్చర్‌)లు కనిపించనున్నాయి. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ రెండు ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..