చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఒప్పో రెనో 8టీ పేరుతో లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. అయితే కచ్చితంగా తేదీ తేలియకపోయినప్పటికీ నెట్టింట లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 3వ తేదీన లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. 4జీతో పాటు 5జీ వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఇక ధర విషయానికొస్తే ఈ ఫోన్ ప్రారంభం ధర రూ. 28,000 వేలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. బ్యాటరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో ఏకంగా 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు.
ఒప్పో రెనో 8టీ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు. రెయిర్ కెమెరా 108 మెగాపిక్సెల్ కాగా సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే లాంచింగ్ ఆఫర్ కింద స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ అందించనున్నట్లు సమాచారం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..