Solar Flare: నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సూర్యుడి నుండి వెలువడే సౌర మంటను గమనించినట్లు చెబుతోంది. దీనిని పెద్ద తుపానుకు సంకేతంగా పేర్కొంటున్నారు. దీని కారణంగా జీపీఎస్ సిగ్నల్స్ అంతరాయం కలిగించవచ్చు. ఈ తుపాను నేడు అంటే శనివారం భూమిని తాకవచ్చని అంచనా వేస్తున్నారు. సూర్యుడి నుంచి గురువారం ఉదయం 11.35 గంటలకు ఎక్స్1 కేటగిరీ గ్లోను విడుదల అయిందనీ.. ఇది ఎన్నడూ లేనంత విపరీతమైన తీవ్రతను కలిగి ఉందని నాసా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకాశవంతమైన కాంతి R2887 సన్‌స్పాట్ నుండి వస్తుందని నాసా వివరించింది. ఈ విషయంపై, Spaceweather.com నివేదిక చెబుతున్న దాని ప్రకారం, ఈ బలమైన సౌర తుపాను సూర్యుని కేంద్రం నుండి వస్తుంది. దాని బలమైన కాంతి నేరుగా భూమిపై పడుతుంది.
హరికేన్ X1 కేటగిరీలో..
ఈ సౌర తుపాను X1 కేటగిరీలో ఉంచారు. ఇది నేడు భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఢీకొనవచ్చు. ఈ విస్ఫోటనం ద్వారా సృష్టించబడిన సౌర మంటలు తాత్కాలిక కమ్యూనికేషన్, నావిగేషన్ బ్లాక్‌అవుట్‌కు కారణమవుతాయని భావిస్తున్నారు. దక్షిణ అమెరికాలో దీని ప్రభావం కనిపిస్తోందని అంటున్నారు. ఈ బలమైన సౌర తుపాను రేడియేషన్ శక్తివంతమైన పేలుడు అని పేర్కొంటున్నారు. అయినప్పటికీ ఇది మానవులకు హాని కలిగించదు. ఇది జీపీఎస్ (GPS), కమ్యూనికేషన్ సిగ్నల్స్ ప్రయాణించే వాతావరణ పొరలను ప్రభావితం చేసేంత బలమైన ప్రకాశాన్ని కలిగి ఉంటుందని కూడా చెబుతున్నారు.
అంతకుముందు, యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ఆధ్వర్యంలోని స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ శుక్రవారం సౌర తుపాను గురించి హెచ్చరికను జారీ చేసింది. గురువారం అర్థరాత్రి సూర్యుడి నుండి కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) తర్వాత అక్టోబర్ 30 న ఈ తుపాను సంభవించవచ్చని కేంద్రం తెలిపింది. ఇది భూమిని ఢీకొనే ప్రమాదం ఉంది. కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) సూర్యుని ఉపరితలంపై అతిపెద్ద విస్ఫోటనాలలో ఒకటి.
ఇవి కూడా చదవండి: Huzurabad by election: కాయ్ రాజా కాయ్.. మంచి తరుణం మించిన దొరకదు..
Telangana: తెలంగాణలో పుర కమిషనర్ల బదిలీలు.. ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి..