Passwords: సోషల్‌ మీడియా అకౌంట్లకు ఇలాంటి పాస్‌వర్డ్స్‌ పెట్టుకుంటున్నారా..? ప్రమాదమే.. వెంటనే మార్చేయండి..!

|

Jan 15, 2022 | 4:16 PM

Passwords: చాలా మంది సోషల్‌ మీడియాకు సంబంధించి అకౌంట్‌కు పాస్‌వర్డ్‌లు సులభంగా గుర్తుండే పాస్‌ వర్డ్‌లను పెట్టుకుంటుంటారు...

Passwords: సోషల్‌ మీడియా అకౌంట్లకు ఇలాంటి పాస్‌వర్డ్స్‌ పెట్టుకుంటున్నారా..? ప్రమాదమే.. వెంటనే మార్చేయండి..!
Follow us on

Passwords: చాలా మంది సోషల్‌ మీడియాకు సంబంధించి అకౌంట్‌కు పాస్‌వర్డ్‌లు సులభంగా గుర్తుండే పాస్‌ వర్డ్‌లను పెట్టుకుంటుంటారు. అలాంటి పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటే ప్రమాదమేనంటున్నారు టెక్‌ నిపుణులు. సులభంగా ఉండే పాస్‌ వర్డ్స్‌ పెట్టుకుంటే సైబర్‌ నేరగాళ్లతో ప్రమాదం ఉండే అవకాశం ఉందని, మీ ఖాతాను హ్యాక్‌ చేసి మీ వ్యక్తిగత వివరాలతో తో పాటు ఖాతాలకు సంబంధించి వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సులభంగా గుర్తు పెట్టుకునే పాస్‌వర్డ్‌ల వల్ల సైబర్‌ నేరాలు ఎన్నో జరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర అకౌంట్‌లపై కన్నేసి ఉంచుతున్నారు. ఎంతటివారి అకౌంట్లనైనా సైబర్‌ నేరగాళ్లు సులవుగా హ్యాక్‌ చేసేస్తున్నారు. సులభమైన పాస్‌వర్డ్స్‌ తో వ్యక్తిగత వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులను దోచేస్తున్నారు.

ఎక్కువగా ఉపయోగించే సులభమైన పాస్‌వర్డులు ఇవే..
123456, password1, qwerty, password, 111111, abc123, 12345,1234567, 12345678, 2222, 112233 ఇలాంటి సులభంగా గుర్తుండే పాస్‌వర్డ్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి సులభంగా గుర్తించుకునే పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటే సైబర్‌ నేరగాళ్ల నుంచి ప్రమాదం ఉందని, వీటి వల్ల మీరు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పాస్‌వర్డ్‌ల వల్ల సైబర్‌ నేరగాళ్లు గుర్తించి మీ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇతర అకౌంట్లను హ్యాక్‌ చేసే అవకాశం ఉందని, దీని వల్ల మీ వ్యక్తిగత వివరాలు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఇలా తెలుసుకోవడం వల్ల మీ బ్యాంక్‌ అంకౌట్‌ వివరాలు కూడా తెలుసుకుంటారని, తర్వాత మీ ఖాతాలో ఉండే మొత్తం కాజేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సులభంగా గుర్తించుకునే పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడం ప్రమాదమేనని చెబుతున్నారు.

పాస్‌వర్డ్స్‌ విషయాల్లో టెక్‌ నిపుణుల హెచ్చరికలు..
సులభమైన పాస్‌వర్డ్స్‌ను నిపుణులు ఎప్పటికప్పుడు గుర్తించి యూజర్లను అప్రమత్తం చేస్తున్నారు. గూగుల్‌ కూడా ఇలాంటి పాస్‌వర్డ్స్‌ను పెట్టుకోవద్దని హెచ్చరిస్తోంది. ప్రతి యేడాది సులభమైన పాస్‌వర్డ్స్‌లను గుర్తించి అప్రమత్తం చేస్తోంది. ఇలాంటి సులభమైన పాస్‌వర్డ్స్‌ పెట్టుకోవడం వల్ల వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు ఖాతాలను సైతం లూటీ చేస్తున్నారు నేరగాళ్లు. అందుకే సోషల్‌ మీడియా అకౌంట్లకు గానీ, బ్యాంకు ఖాతాలు, ఇతర ఖాతాలకు పెట్టుకునే పాస్‌వర్డ్స్‌ బలంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పుడే మన అకౌంట్లకు రక్షణ ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

WhatsApp Blocked: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారా..? ఈ టిప్స్‌తో తెలుసుకోండిలా..!

HDFC FD: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అదిరిపోయే పండగ ఆఫర్‌.. ఆ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు..!