Snow Plus Electric Scooter: క్రేయాన్ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్నో+ ని విడుదల చేసింది. ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం అని ప్రకటించింది. అయితే ఆర్థిక పరంగా బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌తో కిలోమీటరు ప్రయాణించడానికి14 పైసలు మాత్రమే ఖర్చవుతాయి. గంటకు 70 కి.మీ నుంచి 130 కి.మీ మైలేజీని అందిస్తాయి. ఈ నెలఖారులోగా రెండు కొత్త హై-స్పీడ్ మోడళ్లు మార్కెట్‌లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.64,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త స్నో+ స్కూటర్ నాలుగు విభిన్న రంగుల్లో లభ్యం కానుంది. ఈ ఎంపికలలో ఫెయిరీ రెడ్, సన్‌షైన్ ఎల్లో, క్లాసిక్ గ్రే, సూపర్ వైట్ ఉన్నాయి. ఈ స్కూటర్లు 2 సంవత్సరాల వారంటీతో వస్తాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, అనేక ఇతర రాష్ట్రాల్లోని 100 రిటైల్ స్టోర్లలో స్నో+ అందుబాటులో ఉంటుంది.
కొత్త ఎలక్ట్రిక్ వాహనం ఓల్డ్ స్కూటర్‌లా రూపొందించారు. డిజైన్ ఆకట్టుకునేలా ఉంటుంది. లైట్ మొబిలిటీ అవసరాల కోసం దీనిని నిర్మించినట్లు క్రేయాన్ మోటార్స్ పేర్కొంది. ప్రకాశవంతమైన రంగులు, గుండ్రని హెడ్‌ల్యాంప్‌లు, రౌండ్ రియర్-వ్యూ మిర్రర్స్‌ని అమర్చారు. స్కూటర్ పెద్ద, ఫ్లాట్ ఫుట్‌వెల్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇది 250-వాట్ BLDC మోటారుతో వస్తుంది. స్కూటర్‌కు ట్యూబ్‌లెస్ టైర్లు, డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ-స్కూటర్ 155 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. డ్రైవింగ్ రేంజ్ ఇంకా వెల్లడి కాలేదు. డిజిటల్ స్పీడోమీటర్, సెంట్రల్ లాకింగ్, మొబైల్ కోసం USB ఛార్జింగ్ పోర్ట్, యాంటీ-థెఫ్ట్ మెకానిజం, నావిగేషన్ (GPS) వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.