
ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసినా డేటా భద్రంగా ఉంటుందా? పాత ఫోన్ విక్రయించేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? డేటా గోప్యత విషయంలో ప్రజలు ఎలాంటి హామీలను కోరుకుంటున్నారు? పాత ఫోన్ల రీసేల్ మార్కెట్‌లో జరుగుతున్న పరిణామాలు, వినియోగదారుల భయాలు మరియు డేటా భద్రత కోసం వారు సిద్ధపడుతున్న వినూత్న పరిష్కారాల వివరంగా తెలుసుకుందాం..
కొత్త ఫోన్ కోసం పాత ఫోన్‌ను అమ్మేటప్పుడు అందరిలోనూ మొదట మెదిలే ఆలోచన “నా వ్యక్తిగత ఫొటోలు, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, రహస్య చాట్స్ ఇతరుల చేతుల్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి?” అని. క్యాషిఫై సర్వే ప్రకారం, ప్రతి నలుగురిలో ముగ్గురు ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ అమ్మకంలో ధర కంటే డేటా గోప్యతకే 45 శాతం మంది మెుదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.
పాత ఫోన్ అమ్మేటప్పుడు ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేయడం ప్రాథమిక నియమం. కానీ, 83 శాతం మంది ఈ రీసెట్ అవసరమని సూచించినప్పటికీ, అందులో 41 శాతం మంది ఆ ప్రక్రియపై నమ్మకం లేదని పేర్కొన్నారు. మూడింట ఒకవంతు మంది సర్వేలో పాల్గొన్నవారు, తాము పాత ఫోన్ నుండి డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందగలిగామని చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఫ్యాక్టరీ రీసెట్ చేసినా కూడా డేటా సేఫ్ అని వారు భావించడం లేదు.
డేటా భద్రతపై గ్యారెంటీ ఉంటే పాత ఫోన్‌లను ధైర్యంగా అమ్ముతామని చాలా మంది స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం వారు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు.
డిజిటల్ యుగంలో మీ డేటానే మీ అతిపెద్ద సంపద. పాత ఫోన్ అమ్మేముందు సాధ్యమైనంత వరకు క్లౌడ్ డేటాను తొలగించి, అవసరమైతే ఎక్స్‌పర్ట్స్ సలహా తీసుకోండి. ప్లాట్‌ఫామ్స్ కూడా వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకునేందుకు ‘డేటా క్లీనింగ్ సర్టిఫికేషన్’ వంటి పద్ధతులను అనుసరించడం ఇప్పుడు అనివార్యంగా మారింది. కొత్త ఫోన్ కొనడం ఎంత ముఖ్యమో, పాత ఫోన్ అమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అంతకంటే ముఖ్యం!