SBI Account Password: మీకు బ్యాంకు ఖాతా ఉందా..? అకౌంట్‌కు ఇలాంటి పాస్‌వర్డ్‌ పెట్టుకోవద్దంటున్న ఎస్‌బీఐ.!

SBI Account Password Tips: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్లకు ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అకౌంట్‌ పాస్‌వర్డ్‌ విషయంలో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో..

SBI Account Password: మీకు బ్యాంకు ఖాతా ఉందా..? అకౌంట్‌కు ఇలాంటి పాస్‌వర్డ్‌ పెట్టుకోవద్దంటున్న ఎస్‌బీఐ.!
Follow us

|

Updated on: Nov 16, 2021 | 4:55 PM

SBI Account Password Tips: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్లకు ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అకౌంట్‌ పాస్‌వర్డ్‌ విషయంలో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తోంది. అకౌంట్లకు పాస్‌వర్డ్‌ పెట్టుకోవడంతో చాలా జాగ్రత్తగా ఉండాలని, సులభమైన, బలహీనమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం ద్వారా మీ అకౌంట్‌ను హ్యాక్‌ చేసి డబ్బులు దోచుకునే అవకాశం ఉందని సూచిస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్‌ నేరాలను దృష్టిలో ఉంచుకుని ఎస్‌బీఐ ట్విటర్‌ ద్వారా ఎలాంటి పాస్‌వర్స్డ్‌ పెట్టుకోవాలో సూచిస్తోంది. బలహీన పాస్‌వర్డ్స్‌ పెట్టుకోకుండా స్ట్రాంగ్‌గా ఉన్న పాస్‌వర్డ్స్‌ పెట్టుకోవడం వల్ల మీ అకౌంట్ భద్రంగా ఉంటుందని సూచిస్తోంది.

ఎలాంటి పాస్‌వర్డ్‌ ఉండాలి.. మీ అకౌంట్‌కు స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ ఉండాలి. పాస్‌వర్డ్‌లో ABCD, Abcd, 1234 లాంటి పాస్‌వర్డ్స్‌ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దని సూచిస్తోంది. బలహీనమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడం వల్ల హ్యాకర్లు ఇట్టే గుర్తిస్తున్నారని, దీని వల్ల మీరు మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. @_+= లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. నెంబర్‌తో పాటు స్పెషల్‌ క్యారెక్టర్స్‌ ఉంటే పాస్‌వర్డ్‌ ఉంటే అకౌంట్‌ సేఫ్‌ జోన్‌లో ఉంటుంది.

అలాగే మీరు పెట్టే పాస్‌వర్డ్‌లో కనీసం 8 క్యారెక్టర్స్‌ ఉండాలి. అలాగే ఆ క్యారెక్టర్స్‌లో స్పెషల్‌ క్యారెక్టర్స్‌ ఉండటం తప్పనిసరి. అలాగే మీరు సుమారు 12 క్యారెక్టర్ల వరకు పాస్‌వర్డ్‌ పెట్టుకున్నా ఇంకా మంచిదే.

ఇలాంటి పాస్‌వర్డ్స్‌ పెట్టొద్దు.. సాధారణంగా చాలా మంది వీక్‌గా ఉన్న పాస్‌వర్డ్స్‌ పెడుతుంటారు. అలాంటి సమయంలో అకౌంట్‌ హ్యాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. itislocked, thisismypassword లాంటివి,ఇంకా మరెన్నో సింపుల్‌గా ఉండే పాస్‌వర్డ్స్‌ పెడుతుంటారు. ఇలాంటి పాస్‌వర్డ్స్‌ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దని సూచిస్తోంది ఎస్‌బీఐ.

కీ బోర్డులో సింపుల్‌గా గుర్తుండే పాస్‌వర్డ్స్‌.. కీబోర్డులో సింపుల్‌గా ఉంటాయని గుర్తించుకునేలా పాస్‌వర్డ్స్‌ పెడుతుంటారు. అలాంటివి పెట్టుకోవద్దని సూచిస్తోంది. పాస్‌వర్డ్‌ స్ట్రాంగ్‌గా ఉండేలా పెట్టుకోవడం బెటర్‌. అలాగే పాస్‌వర్డ్స్ లో :), :/ లాంటి ఎమోషన్స్‌ని యాడ్‌ చేయకూడదు.

123456789, abcdefg లాంటి పాస్‌వర్డ్స్‌: సాధారణంగా చాలా మంది సింపుల్‌గా గుర్తించుకునేలా కొన్ని పాస్‌వర్డ్స్‌ పెట్టుకుంటారు. 12345678, abcdefg లాంటివి సులభంగా ఉండేలా పెడుతుంటారు. అలాంటి పాస్‌వర్డ్స్‌ పెట్టుకుంటే ప్రమాదమేనంటున్నారు. ఇక DOORBELL బదులు DOOR8377 అనే పాస్‌వర్డ్స్‌ పెడుతుంటారు. ఇలాంటివి కూడా పెట్టుకోవద్దని ఎస్‌బీఐ సూచిస్తోంది.

పుట్టిన తేదీ పాస్‌వర్డ్‌లు.. కొంత మంది అకౌంట్లకు పాస్‌వర్డ్‌లు సులభంగా గుర్తించుకునేలా పుట్టిన తేదీ, పేరు, ఊరుపేరు ఇలా రకరకాలుగా సులభంగా ఉండేవి పెడుతుంటారు. అలాంటివి కూడా పెట్టుకోకపోవడం మంచిది. Ramesh@1967 వంటి పాస్‌వర్డ్స్‌ ఉంటాయని ఎస్‌బీఐ ఉదాహారణకు సూచించింది. ఇలాంటివి పేరుతో పాటు పుట్టిన సంవత్సరం పేరు వచ్చేలా పెట్టుకోవద్దని చెబుతోంది. అయితే బ్యాంకుకు సంబంధించిన అకౌంట్స్‌, యాప్స్‌కు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఉండే అకౌంట్స్‌, సోషల్‌ మీడియా అకౌంట్స్‌కు కూడా ఇలాంటి పాస్‌వర్డ్స్‌ టిప్ప్‌ అనుసరించవచ్చని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) సూచిస్తోంది.

ఇవి కూడా చదవండి:

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ స్టేషన్‌లో దేశంలోనే తొలి పాడ్‌ హోటల్‌.. రేపు ప్రారంభం!

SBI Loan: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. నాలుగు క్లిక్స్‌తో వ్యక్తిగత రుణాలు.. వెంటనే అకౌంట్లోకి డబ్బులు..!