Sanjal Gavande: నాసా వద్దన్నా.. బ్లూ ఆరిజన్‌లో దూకుడు.. అమెజాన్ రాకెట్‌ తయారీలో భారతీయ వనిత..

|

Jul 18, 2021 | 9:03 AM

Sanjal Gavande - New Shepard: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అంతరిక్షల యాత్రల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే వర్జిన్‌ గెలాక్టిక్‌తో బ్రాన్సన్‌ నింగిలోకి పయనించగా..

Sanjal Gavande: నాసా వద్దన్నా.. బ్లూ ఆరిజన్‌లో దూకుడు.. అమెజాన్ రాకెట్‌ తయారీలో భారతీయ వనిత..
Sanjal Gavande
Follow us on

Sanjal Gavande – New Shepard: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అంతరిక్షల యాత్రల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే వర్జిన్‌ గెలాక్టిక్‌తో బ్రాన్సన్‌ నింగిలోకి పయనించగా.. త్వరలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ అంతరిక్షయానానికి సిద్ధం అవుతున్నారు. ఈ అంతరిక్షయానంలో భారతీయుల పాత్ర కీలకంగా ఉంది. బ్రాన్సన్‌ ప్రయాణంలో భారత సంతతి వ్యక్తి శిరీష కీలకంగా వ్యవహరించినట్లే.. బెజోస్‌ యాత్రలో మరో భారతీయ యువతి కీలక పాత్ర పోషిస్తోంది. జెఫ్‌ బెజోస్‌ను ఈ నెల 20న రోదసిలోకి తీసుకెళ్లే ‘న్యూ షెపర్డ్‌’ రాకెట్‌ వ్యవస్థను నిర్మించిన ఇంజినీర్ల బృందంలో భారత్‌కు చెందిన 30 ఏళ్ల సంజల్‌ గవాండే ముఖ్య భూమిక వహించింది. మహారాష్ట్రలోని కల్యాణ్‌ ప్రాంతానికి చెందిన గవాండే.. బెజోస్‌కు సంబంధించిన అంతరిక్ష సంస్థ ‘బ్లూ ఆరిజిన్‌’లో పనిచేస్తున్నారు. ఆమె తండ్రి అశోక్‌ గవాండే. ఆయన మున్సిపల్ ఉద్యోగి.

గతంలో ఆమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా పౌరసత్వ సమస్యలతో ఎంపిక కాలేదు. అనంతరం సంజల్ గవాండే బ్లూ ఆరిజన్‌లో సిస్టమ్‌ ఇంజినీర్‌గా చేరింది. ముంబై యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీర్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత 2011లో అమెరికాలోని మిషిగన్‌ టెక్నోలాజిక్‌ యూనివర్సిటీలో చేరి మాస్టర్స్ పట్టా పొందింది. ఒక అమ్మాయి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ఎంచుకోవడమేంటంటూ.. గతంలో తనతో చాలామంది అన్నారని సంజల్‌ తండ్రి అశోక్‌ గవాండే పేర్కొన్నారు. కానీ.. ఆమె అందరి అనుమానాలను పటాపంచలు చేసి తాము గర్వపడేలా చేసిందంటూ ఆనందం వ్యక్తం చేశారు.

Also Read:

Viral Video: నీ దుంపతెగ.. ఇదేం సాహసం రా నాయనా.. ఎత్తైన వంతెన నుంచి ఎలా దూకేశాడో చూడండి..!

TB Tests: కరోనా నుంచి కోలుకున్నవారంతా.. టీబీ పరీక్షలు చేయించుకోవాలి: కేంద్ర ప్రభుత్వం