Smart phone: రిపేర్‌కి ఇచ్చే సమయంలో ఫోన్‌లోని డేటా కోసం వర్రీ అవుతున్నారా.? ఈ కొత్త ఫీచర్ మీ కోసమే..
Smart phone: ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే కేవలం అవతలి వ్యక్తితో మాట్లాడుకోవడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే కానీ ఎప్పుడైతే స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి..
Smart phone: ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే కేవలం అవతలి వ్యక్తితో మాట్లాడుకోవడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే కానీ ఎప్పుడైతే స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి సీన్ మొత్తం మారిపోయింది. ప్రతీ చిన్న పనికి స్మార్ట్‌ఫోన్ ఏకైక అస్త్రంగా మారింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏదైనా చేసే అవకాశం లభించింది. అయితే స్మార్ట్ ఫోన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగిస్తున్న వారికి ప్రధాన శత్రువు డేటా. వ్యక్తిగత విషయాలను నుంచి ఖాతాలకు సంబంధించి వివరాల వరకు సమస్త సమాచారమంతా స్మార్ట్‌ఫోన్స్‌లోనే ఉంటుంది. దీంతో ఫోన్‌ను పక్క వ్యక్తికే ఇవ్వడానికి జంకే రోజులొచ్చాయి.
మరి ఒకవేళ స్మార్ట్ ఫోన్ రిపేర్ అయితే పరిస్థితి ఏంటి.? ఒక రోజు మొత్తం రిపేర్ షాపులో ఇవ్వాల్సిందే. అలాంటప్పుడు డేటా భద్రత ఎలా.? చాలా మంది ఫోన్‌లోని డేటా మొత్తాన్ని తొలగించి రిపేర్‌కు ఇస్తుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఫోన్‌ను ఈ ఫీచర్‌తో తీసుకురానున్నారు. అయితే అనంతరం ఇతర మోడల్స్‌లోనూ ఈ ఫీచర్‌ను తీసుకురావాలనే ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇంతకీ ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందులోని బ్యాటరీ అండ్ డివైస్ కేర్‌లో ఉండే రిపేర్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో మీ స్మార్ట్‌ఫోన్ రీబూట్ అవుతుంది. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌లోని వ్యక్తిగత డేటాను ఎవరూ యాక్సెస్ చేయలేరు. దీంతో ఫోన్ రిపేర్ చేసే వ్యక్తి ఎలాంటి టూల్స్‌ను ఉపయోగించిన ఫోన్‌లోని డేటా కనిపించదు. రిపేర్ పూర్తయిన తర్వాత వేలిముద్ర లేదా అన్‌లాక్ కోడ్ ద్వారా రీపేర్ మోడ్ డీయాక్టివేట్ చేసుకోవచ్చు. త్వరలోనే సామ్‌సంగ్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..