Samsung Galaxy M13: మార్కెట్లోకి సామ్‌సంగ్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేసింది.. తక్కువ బడ్జెట్‌లో ఆకట్టుకునే ఫీచర్లు..

|

Jul 14, 2022 | 12:54 PM

Samsung Galaxy M13: ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌. ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకున్న సామ్‌సంగ్ ఎమ్‌ సిరీస్‌లో వరుసగా కొత్త ఫోన్‌లను...

Samsung Galaxy M13: మార్కెట్లోకి సామ్‌సంగ్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేసింది.. తక్కువ బడ్జెట్‌లో ఆకట్టుకునే ఫీచర్లు..
Follow us on

Samsung Galaxy M13: ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌. ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకున్న సామ్‌సంగ్ ఎమ్‌ సిరీస్‌లో వరుసగా కొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌13 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గురువారం ఈ ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్‌ చేసింది. సామ్‌సంగ్‌ ఎమ్‌ 13 ఫోన్‌ను 4జీ, 5జీ రెండు వెర్షన్స్‌లో విడుదల చేశారు. అమెజాన్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీ కోసం..

5జీ నెట్‌వర్కింగ్‌కు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో 15 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. భారత్‌లో జూలై 14న లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ మొదటి సేల్‌ అమెజాన్‌లో జూలై 23 నుంచి ప్రారంభంకానుంది. మిడ్‌నైట్‌ బ్లూ, అక్వా గ్రీన్‌, స్టార్‌డస్ట్‌ బ్రౌన్‌ ఇలా మూడు రంగుల్లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. స్క్రీన్‌ విషయానికొస్తే 6.51 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఇక సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌13 4జీ వెర్షన్‌ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 50 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరా ఈ ఫోన్‌ సొంతం.

ధర విషయానికొస్తే గ్యాలక్సీ ఎమ్‌ 13 4జీ 4జీబీ ర్యామ్‌+64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 11,999కాగా 6 జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 12,999గా ఉంది. ఇక సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌13 5జీ ఫోన్‌ విషయానికొస్తే.. 4జీ 4జీబీ ర్యామ్‌+64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,999కాగా 6 జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 12,999గా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..