Samsung S23: భారత మార్కెట్‌లోకి సామ్‌సంగ్ S23.. అదిరిపోయే ఫీచర్స్‌తో అందుబాటులోకి..

| Edited By: Anil kumar poka

Jan 13, 2023 | 5:47 PM

సామ్ సంగ్ నూతన మోడల్ అయిన గెలాక్సీ ఎస్ 23ను రిలీజ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త సిరీస్ ఫోన్ లో అదిరిపోయే ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది. 200 ఎంపీ కెమెరాతో పాటు, శాటిలైట్ కనెక్టవిటీతో పాటు మరెన్నో అప్ గ్రేడెడ్ ఫీచర్స్ ఈ ఫోన్ కు సామ్ సంగ్ అందిస్తుందని అంచనా వేస్తున్నాయి.

Samsung S23: భారత మార్కెట్‌లోకి సామ్‌సంగ్ S23.. అదిరిపోయే ఫీచర్స్‌తో అందుబాటులోకి..
Samsung Galaxy S23
Follow us on

సామ్ సంగ్ మొబైల్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సామ్ సంగ్ ఎస్ 23 సిరీస్ ను ఆ కంపెనీ భారత మార్కెట్ లోకి లాంచ్ చేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఫిబ్రవరి 1న గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు అఫిషియల్ గా ఎనౌన్స్ చేసింది. అయితే ఈ ఈవెంట్ లో సామ్ సంగ్ నూతన మోడల్ అయిన గెలాక్సీ ఎస్ 23ను రిలీజ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త సిరీస్ ఫోన్ లో అదిరిపోయే ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది. 200 ఎంపీ కెమెరాతో పాటు, శాటిలైట్ కనెక్టవిటీతో పాటు మరెన్నో అప్ గ్రేడెడ్ ఫీచర్స్ ఈ ఫోన్ కు సామ్ సంగ్ అందిస్తుందని అంచనా వేస్తున్నాయి. అలాగే ఈ ఫోన్ మూడు ప్రధాన వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 23, సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 23 ప్లస్, సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా మోడల్స్ లో కంపెనీ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రీ ఆర్డర్ ఎప్పుడు?

ఈ ఫోన్ ను కంపెనీ ప్రతినిధులు రిలీజ్ చేయగానే ప్రీ ఆర్డర్ బుకింగ్స్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫోన్ కోసం సామ్ సంగ్ స్టోర్స్, అలాగే సామ్ సంగ్ వెబ్ సైట్ తో పాటు అమెజాన్ షాపింగ్ వెబ్ సైట్ ద్వారా ప్రీ ఆర్డర్స్ ను బుక్ చేయవచ్చు. అయితే ప్రీ ఆర్డర్ చేయడానికి రూ.1999 ముందే వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రీ ఆర్డర్ చేసిన వారికి రూ.5000 విలువైన అదనపు ప్రయోజనాలను కంపెనీ అందించనుంది. అయితే అదనపు ప్రయోజనాలు కావాలంటే ఈ మొబైల్ మార్చి 31, 2023 లోపు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫీచర్లు ఇవే..

ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్, 2 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే సామ్ సంగ్ వన్ యూఐ సపోర్ట్ తో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్ లో శాటిలైట్ కనెక్టవిటీ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. పలు నివేదికల ప్రకారం ఇరిడియం-గ్లోబల్ శాటిలైట్ కనెక్షన్ తో అత్యవసర సమయంలో వినియోగదారులకు సాయం చేస్తుంది. అయితే ధర విషయంలోనే వినియోగదారులు నిరాశకు గురవుతారు. ఎందుకంటే ఈ మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ.70 వేల కంటే ఎక్కువ ఉంటుందని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం