Samsung Galaxy F62: శాంసంగ్‌ బంపర్‌ ఆఫర్.. ఆ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు.. అదిరిపోయే ఫీచర్స్‌!

Samsung Galaxy F62: ప్రతి రోజు మార్కెట్లో రోజుకోజు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. రకరకాల ఫీచర్స్‌ను జోడిస్తూ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అందుకు భారీగా డిస్కౌంట్లు..

Samsung Galaxy F62: శాంసంగ్‌ బంపర్‌ ఆఫర్.. ఆ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు.. అదిరిపోయే ఫీచర్స్‌!
Samsung Galaxy F62

Updated on: Aug 07, 2021 | 12:28 PM

Samsung Galaxy F62: ప్రతి రోజు మార్కెట్లో రోజుకోజు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. రకరకాల ఫీచర్స్‌ను జోడిస్తూ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అందుకు భారీగా డిస్కౌంట్లు కూడా అందిస్తున్నాయి. ఇక తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ మొబైల్‌ కొనుగోలుదారులకు శుభవార్త వినిపించింది. శాంసంగ్‌ గెలక్సీ ఎఫ్‌62 స్మార్ట్‌ఫోన్‌ ధరను సుమారు 6 వేల వరకు తగ్గించింది. అయితే ఈ ఆఫర్‌ వ్యాలిడిటీ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. శాంసంగ్‌ గెలక్సీ ఎఫ్‌62ను ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లలోకి కంపెనీ విడుదల చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌62 రెండు రకాల వేరియంట్లలో లభించనుంది.

ఇక 6జీబీ వేరియంట్‌ శాంసంగ్‌ గెలక్సీ ఎఫ్‌62 అసలు ధర రూ.23,999 ఉండగా, తగ్గింపు ధరతో రూ.17,999కు అందుబాటులో ఉంది. అలాగే 8జీబీ వేరియంట్‌ అసలు ధర రూ. 25, 999 ఉండగా, ప్రస్తుతం తగ్గింపు ధరతో రూ. 19, 999కు అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులపై కొనుగోలు చేస్తే సుమారు రూ. 2500 క్యాష్‌ బ్యాక్‌ను కూడా అందించనుంది. ఫ్లిప్‌కార్టులో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1000 వరకు తగ్గింపుతో లభిస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌62 ఫీచర్‌లు

► ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యుఐ 3.1
► 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ- O డిస్‌ప్లే
► 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
► 12 మెగాపిక్సెల్‌ సెకండరీ కెమెరా
► Exynos 9825 ప్రాసెసర్
► 7000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ
► డ్యూయల్ సిమ్ (నానో)
► యూఎస్‌బీ టైప్‌ సీ
► 25w ఫాస్ట్‌ఛార్జింగ్‌

ఇవీ కూడా చదవండి

Motorola Edge S Pro: మోటొరోలా కొత్త ఫోన్ విడుదల.. ఫీచర్లలో హైఎండ్.. ధర మాత్రం మిడ్ రేంజ్..!

Twitter: ట్విటర్‌ బంపర్‌ ఆఫర్‌.. బగ్‌ను గుర్తిస్తే భారీ బహుమతి.. హ్యాకర్లకు సవాల్‌ విసరుతున్న ట్విటర్‌..!

Google Pixel 6: గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌లో అదిరిపోయే ఫీచర్స్‌.. వైడ్ యాంగిల్ ప్రధాన కెమెరా..టెలిఫొటో షూటర్!