Samsung Galaxy F23 5G: శాంసంగ్‌ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్స్‌ వివరాలు..!

|

Mar 08, 2022 | 9:22 PM

Samsung Galaxy F23 5G మంగళవారం భారతదేశంలో ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం ప్రారంభించిన Galaxy F22 అప్‌గ్రేడ్ వేరియంట్. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది..

Samsung Galaxy F23 5G: శాంసంగ్‌ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్స్‌ వివరాలు..!
Follow us on

Samsung Galaxy F23 5G మంగళవారం భారతదేశంలో ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం ప్రారంభించిన Galaxy F22 అప్‌గ్రేడ్ వేరియంట్. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కంపెనీ డిస్‌ప్లే, చిప్‌సెట్, కెమెరా విభాగాన్ని మెరుగుపరిచింది. ఇందులో వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే ఉంది. అలాగే ఇది వెనుక ప్యానెల్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Redmi Note 11T 5G, Vivo 1T 5G మరియు Oppo యొక్క చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది.

Samsung Galaxy F23G ధర రూ.17499గా ఉండనుంది. ఈ ధరలో 4 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. అయితే 6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ 18499గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1000 తక్షణ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. దీని కోసం ICICI బ్యాంక్ క్రెడిట్ కార్ట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

స్పెసిఫికేషన్‌లు:

Samsung Galaxy F23 5G స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే.. ఇది 6.6-అంగుళాల ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది, ఇది స్క్రోలింగ్, గేమింగ్‌ను మెరుగుపరుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 750G ప్రాసెసర్, Adreno 619 GPU ఇందులో ఇవ్వబడింది. ఈ ఫోన్ గరిష్టంగా 6 GB RAM మరియు 128 GB వరకు ఇంటర్నల్‌ స్టోరేజీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 12 ఆధారిత OneUI 4.1 కస్టమ్ స్కిన్ ఇవ్వబడింది. Samsung Galaxy F23 5Gలో సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇవ్వబడింది. ఇది డాల్బీ అట్మాస్ సపోర్టుతో వస్తుంది. ఇందులో Samsung Pay ఆప్షన్ కూడా ఉంది. 5G, 4G LTE డ్యూయల్ బ్యాండ్ ఉంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంది.

 కెమెరా సెటప్:

Samsung Galaxy F23 5G కెమెరా విభాగం గురించి మాట్లాడితే.. ఇది వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులోని ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్స్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మూడవ కెమెరా 2 మెగాపిక్సెల్స్. ఇందులో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

ఇవి కూడా చదవండి:

Google Images: మీకు గూగుల్‌లో కావాల్సిన ఫోటోలు దొరకడం లేదా..? ఇలా చేయండి..!

AYYA T1 Smartphone: యాపిల్‌ ఫోన్‌కు ధీటుగా రష్యా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌..!