iPhone 16: 13 వేల తగ్గింపుతో ఐఫోన్ 16, ఇక్కడ కొంటే మరో 4 వేలు డిస్కౌంట్

ఐఫోన్ 16పై ఏకంగా రూ. 13000 తగ్గింపు లభిస్తోంది. దీంతోపాటు పలు బ్యాంకుల కార్డులను ఉపయోగించి మరో రూ. 4000 వేలు కూడా డిస్కౌంట్ పొందవచ్చు. విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 16ను కొనుగోలు చేస్తే ఈ మొత్తం ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉన్నట్లు విజయ్ సేల్స్ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

iPhone 16: 13 వేల తగ్గింపుతో ఐఫోన్ 16, ఇక్కడ కొంటే మరో 4 వేలు డిస్కౌంట్

Updated on: Dec 25, 2025 | 4:16 PM

ఐఫోన్ ప్రియులకు ఇది తీపి కబురు. ఎందుకంటే ఐఫోన్ 16 పై ఏకంగా రూ. 13000 తగ్గింపు లభిస్తోంది. దీంతోపాటు మరో రూ. 4000 వేలు కూడా డిస్కౌంట్ లభించాలంటే ఆ ఒక్క చోటే ఐఫోన్ కొనాలి. ఆ ఒక్క చోటు ఏదంటే విజయ్ సేల్స్. పలు బ్యాంక్ కార్డులు ఉపయోగించి విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 16ను కొనుగోలు చేయవచ్చు.

మనదేశంలో ఐఫోన్ 16 ధర ఎంతంటే?

ప్రస్తుతం భారత మార్కెట్లో ఐఫోన్ 16 రూ. 79,900 ప్రారంభ ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది 128జీబీ స్టోరేజ్ వేరియంట్. ప్రస్తుతం ఐఫోన్ 16 (iPhone 16) 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను విజయ్ సేల్స్ తన అధికారిక వెబ్‌సైట్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఏకంగా రూ. 13 వేలు తగ్గించి రూ. 66,900కు విక్రయిస్తోంది.

అదనంగా మరో 4 వేలు తగ్గింపు ఇలా

విజయ్ సేల్స్ వెబ్‌సైట్ ద్వారా ఐఫోన్ 16 కొనుగోలు చేస్తే రూ. 13 వేల తగ్గింపుతోపాటు మరో ఆఫర్ కూడా పొందవచ్చు. ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే మరో రూ. 4000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. మీ పాత ఫోన్‌ను మార్చుకుని కొత్త ఫోన్ తీసుకోవడం ద్వారా కూడా మరింత ఆదా చేసుకోవచ్చు.

ఐఫోన్ 16 స్పెసిఫికేషన్స్

ఈ ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED ప్యానెల్‌ను కలిగివుంది. A18 బయోనిక్ ప్రాసెసర్‌ను ఉపయోగించడం వల్ల దీని స్పీడ్, మల్టీటాస్కింగ్ మెరుగ్గా ఉంది. iOS 26పై నడుస్తున్న ఈ ఫోన్ 25W MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. 48 మెగా పిక్సెల్ రేర్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరాను కలిగివుంది. 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉండటంతో సెల్ఫీలు సూపర్‌గా తీసుకొచ్చాయి.