Revolt Electric Bike: రివోల్ట్ మోటార్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బుకింగ్స్ ప్రారంభం.. మామూలు ప్లగ్‌తో బ్యాటరీ ఛార్జ్ చేసుకోవచ్చు..

|

Oct 22, 2021 | 8:41 AM

పెరుగుతున్న పెట్రోల్ ధరలు ప్రజల్ని ప్రత్యామ్నాయాల వైపు నడిపిస్తున్నాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి పోటీలు పడుతున్నాయి. ఇ

Revolt Electric Bike: రివోల్ట్ మోటార్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బుకింగ్స్ ప్రారంభం.. మామూలు ప్లగ్‌తో బ్యాటరీ ఛార్జ్ చేసుకోవచ్చు..
Revolt Rv400 E Bike
Follow us on

Revolt Electric Bike:  పెరుగుతున్న పెట్రోల్ ధరలు ప్రజల్ని ప్రత్యామ్నాయాల వైపు నడిపిస్తున్నాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి పోటీలు పడుతున్నాయి. ఇప్పుడు ద్విచక్ర వాహనాల కంపెనీలలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి. మరిన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రివోల్ట్ కంపెనీ ఆర్వీ సిరీస్ లో బైక్ ను ప్రకటించింది. స్టైలిష్ లుక్ తో మంచి ఫీచర్లతో అందుబాటులోకి తీసుకు వస్తున్న ఈ బైక్ కోసం గతంలో బుకింగ్స్ ప్రారంభించింది. ఇప్పుడు మళ్ళీ మరోసారి బుకింగ్స్ ప్రారంభిస్తోంది.

రివోల్ట్  RV400 ధర ఏంటంటే..

రివోల్ట్ మోటార్స్ నుండి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ RV400 కోసం ముందస్తు బుకింగ్‌లు భారత్ లో మరోసారి ప్రారంభమయ్యాయి. FAME-II సబ్సిడీ తర్వాత, RV400 ధర రూ .1.07 లక్షలుగా నిర్ణయించారు. (ఎక్స్-షోరూమ్).

70 నగరాల నుండి బుక్ చేసుకోవచ్చు..

ఈసారి కంపెనీ భారతదేశంలోని 70 నగరాల్లో బుకింగ్‌ను పెంచింది. ఇందులో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రో నగరాలు ఉన్నాయి. రివోల్ట్ RV 400 ఇప్పుడు కొత్త రంగులలో రెగ్యులర్ కాస్మిక్ బ్లాక్‌లో మిస్ట్ గ్రే, రెబెల్ రెడ్ కలర్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంటుంది.

గరిష్ట వేగం 85 kmph

ఎలక్ట్రిక్ బైక్ 5 గంటల్లో ఛార్జ్ అవుతుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం 80 కిమీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఎకో మోడ్‌లో ఈ పరిధి 150 కిమీ వరకు ఉంటుంది. ఎలక్ట్రిక్ బైక్ గరిష్ట వేగం గంటకు 85 కిమీ.

రివోల్ట్ RV400 మై రివాల్ట్ యాప్‌తో అమర్చి ఉంటుంది. ఇది లొకేషన్ ట్రాకింగ్, బ్యాటరీ స్థితి, రైడ్‌ల చారిత్రక డేటా, బైక్ డయాగ్నస్టిక్స్ అలాగే రివాల్ట్ స్విచ్ స్టేషన్‌లను అనుమతిస్తుంది.

ఎక్కడైనా ఛార్జ్ చేయవచ్చు

రివోల్ట్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది చాలా ప్రత్యేకమైన, సులభమైన ఛార్జింగ్ వ్యవస్థను కలిగి ఉంది. దీనికి ఛార్జర్ ఉంది. ఇది ల్యాప్‌టాప్ ఛార్జర్ కంటే కొంచెం పెద్దది. ఈ ఛార్జర్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మోటార్‌సైకిల్‌ను ఛార్జ్ చేయడానికి ఏదైనా పవర్ సాకెట్‌కి కనెక్ట్ చేయవచ్చు. ఇది ఇంట్లో లేదా కార్యాలయంలో ఎక్కడైనా ఉపయోగించవచ్చు.

బైక్‌లో ఇచ్చిన బ్యాటరీ అన్ని వాతావరణాలకు అనుకూలమైనది. ఇది ARAI ప్రమాణం ప్రకారం వస్తుంది. ఇది వాటర్‌ప్రూఫ్, డ్యామేజ్ ప్రూఫ్ అదేవిధంగా షాక్ ప్రూఫ్ కూడా అని కంపెనీ చెబుతోంది.

ఇవి కూడా చదవండి: AP-TS నీటి పంచాయితీ.. మీ మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్‌కు విరుద్ధమంటూ తెలంగాణ మరో లేఖాస్త్రం

Cyber Security: సైబర్ సెక్యూరిటీ ఛాలెంజింగ్‌గా మారిన నేపథ్యంలో తెలంగాణలో యావత్ దేశానికే పయినీర్‌లా ఉండే పాలసీ

Pakistan: మళ్ళీ గ్రే లిస్టులో పాకిస్తాన్‌.. టెర్రరిజానికి కొమ్ము కాస్తున్నందుకు రెట్టింపైన పాక్ కష్టాలు!