Jio Phone Next: సులభమైన నెలవారి చెల్లింపులతో జియోఫోన్‌ నెక్ట్స్‌ మీ సొంతం.. ఈఎమ్‌ఐ మొత్తానితో బెన్‌ఫిట్స్‌ కూడా..

|

Nov 07, 2021 | 1:28 PM

Jio Phone Next: రిలయన్స్‌ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్మార్ట్‌ ఫోన్ జియో నెక్ట్స్‌. అత్యంత తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్‌ను పరిచయం చేసిన ఈ ఫోన్‌పై మార్కెట్లో ఎక్కడలేని క్రేజ్‌ వచ్చింది...

Jio Phone Next: సులభమైన నెలవారి చెల్లింపులతో జియోఫోన్‌ నెక్ట్స్‌ మీ సొంతం.. ఈఎమ్‌ఐ మొత్తానితో బెన్‌ఫిట్స్‌ కూడా..
Jio Phone Next
Follow us on

Jio Phone Next: రిలయన్స్‌ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్మార్ట్‌ ఫోన్ జియో నెక్ట్స్‌. అత్యంత తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్‌ను పరిచయం చేసిన ఈ ఫోన్‌పై మార్కెట్లో ఎక్కడలేని క్రేజ్‌ వచ్చింది. అంతేకాకుండా సులభమైన ఈఎమ్‌ఐల విధానంలో ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక వినియోగదారులు కేవలం రూ. 1,999 చెల్లిస్తే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఈఎమ్‌ఐల రూపంలో చెల్లించే వెసులుబాటను కలిపించారు.

ఫోన్‌ను బుక్‌ చేసుకునే సమయంలో రూ. 501 ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే జియో ఫోన్ సొంతం చేసుకోవాలనుకుంటున్న యూజర్ల కోసం రిలయన్స్‌ మరో బంపరాఫర్‌ను ప్రకటించింది. సులభమైన నెలవారి చెల్లింపులతో ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కలిపించింది. అయితే ఈఎమ్‌ఐతో పాటు డేటా, కాల్‌ బెన్‌ఫిట్స్‌ పొందే అవకాశాన్ని కలిపింది. ఇందు కోసం జియో నాలుగు రకాల ప్యాక్‌లను అందించింది. అవేంటంటే..

అల్వేస్‌ ఆన్‌ ప్లాన్..

* నెలకు రూ. 300 చొప్పున 24 నెలల ఈఎమ్‌ఐ చెల్లిస్తే.. నెలలో 5 జీబీ డేటాతో పాటు 100 నిమిషాల టాక్‌టైమ్‌ను పొందొచ్చు./ నెలకు రూ. 350 చొప్పిన 18 నెలల ఈఎమ్‌ఐ కూడా చెల్లించవచ్చు.

లార్జ్‌ ప్లాన్‌..

* నెలకు రూ. 450 చొప్పున 24 నెలల ఈఎమ్‌ఐ చెల్లిస్తే.. ప్రతి రోజూ 1.5 జీబీ డేటాతో పాటు అపరిమితమైన కాల్స్‌ పొందొచ్చు./ నెలకు రూ. 500 చొప్పున 18 నెలల ఈఎమ్‌ఐ చెల్లించే అవకాశం కూడా ఇచ్చారు.

ఎక్స్‌ఎల్‌ ప్లాన్‌..

* నెలకు రూ. 500 చొప్పున 24 నెలల ఈఎమ్‌ఐ చెల్లిస్తే.. ప్రతి రోజూ 2 జీబీ డేటాతో పాటు అపరిమితమైన కాల్స్‌ పొందొచ్చు./ నెలకు రూ. 550 చొప్పున 18 నెలల ఈఎమ్‌ఐ చెల్లించే అవకాశం కూడా ఇచ్చారు.

ఎక్స్‌ఎక్స్‌ఎల్‌ ప్లాన్‌..

* నెలకు రూ. 550 చొప్పున 24 నెలల ఈఎమ్‌ఐ చెల్లిస్తే.. ప్రతి రోజూ 2.5 జీబీ డేటాతో పాటు అపరిమితమైన కాల్స్‌ పొందొచ్చు./ నెలకు రూ. 600 చొప్పున 18 నెలల ఈఎమ్‌ఐ చెల్లించే అవకాశం కూడా ఇచ్చారు.

ఇక జియో నెక్ట్స్‌ ఫోన్‌ను ఎలాంటి ఈఎమ్‌ఐ లేకుండా కొనుగోలు చేస్తే రూ. 6499కే సొంతం చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.

 

Also Read: Bheemla Nayak: మాటల మాంత్రికుడికి భీమ్లా నాయక్‌ టీమ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌.. పాటలోనూ ప్రాస వదలని త్రివిక్రమ్‌..

Gold Purchase: బంగారం కొనుగోలు చేస్తున్నారా? బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు..అందులో ఏయే అంశాలు ఉండాలో తెలుసా?

AP Local Body Elections: చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలకు షాక్.. బంగారుపాశ్యం, కలకడ జెడ్‌పిటిసి అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ