Jio AirFiber: ఎయిర్‌ ఫైబర్‌ను వేగంగా విస్తరిస్తున్న జియో.. కొత్తగా మరో 115 నగరాల్లో..

|

Nov 13, 2023 | 4:00 PM

తొలుత కేవలం 8 పట్టణాల్లో మాత్రమే జియో ఈ సేవలను తీసుకొచ్చింది. హైదరాబాద్‌తోపాటు.. అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుణె పట్టణాల్లో ఎయిర్‌ ఫైబర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకొని తాజాగా మరో 115 నగరాలకు ఈ సేవలను జియో విస్తరించింది. దేశవ్యాప్తంగా మొత్తం 115 నగరాల్లో ఈ సేవలను విస్తరించగా ఇందులో..

Jio AirFiber: ఎయిర్‌ ఫైబర్‌ను వేగంగా విస్తరిస్తున్న జియో.. కొత్తగా మరో 115 నగరాల్లో..
Jio Air Fiber
Follow us on

వేగవంతమైన బ్రాడ్‌ బ్యాండ్‌ ఇంటర్‌నెట్ సేవలను అందించేందుకు గాను జియో ఎయిర్ ఫైబర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దేశంలో ప్రతీ గ్రామానికి ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తున్న జియో.. ఇప్పటికే 5జీ ఆధారిత బ్రాడ్‌ బ్యాండ్ సేవలను పలు నగరాల్లో ప్రారంభించింది.

తొలుత కేవలం 8 పట్టణాల్లో మాత్రమే జియో ఈ సేవలను తీసుకొచ్చింది. హైదరాబాద్‌తోపాటు.. అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుణె పట్టణాల్లో ఎయిర్‌ ఫైబర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకొని తాజాగా మరో 115 నగరాలకు ఈ సేవలను జియో విస్తరించింది. దేశవ్యాప్తంగా మొత్తం 115 నగరాల్లో ఈ సేవలను విస్తరించగా ఇందులో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 32 పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ పట్టణాలు..

జియో విస్తరణలో భాగంగా తెలంగాణలోని.. హైదరాబాద్‌, ఆర్మూరు, జగిత్యాల, కరీంనగర్‌, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మిర్యాలగూడ, నిర్మల్‌, నిజామాబాద్‌, పాల్వంచ, పెద్దపల్లి, రామగుండం, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, తాండూరు, వరంగల్‌ పట్టణాల్లో సేవలు ప్రారంభించారు. ఇక ఏపీ విషయానికొస్తే.. అనంతపురం, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరాల్లో జియో ఎయిర్‌ ఫైబర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

జియో ఎయిర్‌ ఫైబర్ బ్రాడ్‌ బ్యాండ్ సర్వీస్‌లో భాగంగా 550కు పైగా డిజిటల్‌ టీవీ ఛానెళ్లు, 16కు పైగా ఓటీటీ యాప్‌లు, స్మార్ట్‌హోమ్‌ సేవలు అందిస్తున్నారు. ఇక జియో ఎయిర్‌ ఫైబర్‌ ప్లాన్స్‌ విషయానికొస్తే.. రూ. 599తో రీఛార్జ్‌ చేసుకుంటే 30 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ ఇంటర్నెట్‌తో 550కిపైగా డిజిటల్ ఛానెల్స్‌తో పాటు 14 ఓటీటీ సేవలను పొందొచ్చు.

ఇక రూ. 899తో రీఛార్జ్‌ చేసుకుంటే 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ ఇంటర్నెట్‌తో 550కిపైగా ఛానెల్స్‌తో పాటు 14 ఓటీటీ యాప్‌లు చూడొచ్చు. ఇక రూ. 1199తో రీఛార్జ్‌తో 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో 550కిపైగా డిజిటల్‌ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్‌లు, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, జియో సినిమా ప్రీమియం వంటి సేవలు పొందొచ్చు. వీటితోపాటు జియో అదనంగా జియో ఎయిర్‌ ఫైబర్‌ మ్యాక్స్‌ ప్లాన్‌లను కూడా అందిస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..