Redmi Note 14 Pro: త్వరలోనే మార్కెట్‌లోకి రెడ్‌మీ నోట్ 14 ప్రో.. వైరల్ అవుతున్న లీక్‌డ్ పిక్చర్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఎంఐ ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ రెడ్ మీ నోట్ 13 సిరీస్ జనవరిలో భారతదేశంలో ప్రారంభించింది. తాజాగా రెడ్ నోట్ 14 సిరీస్‌ను కూడా ఎంఐ భారత్‌లో లాంచ్ చేయనుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రెడ్ మీ నోట్ 14 సిరీస్ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Redmi Note 14 Pro: త్వరలోనే మార్కెట్‌లోకి రెడ్‌మీ నోట్ 14 ప్రో.. వైరల్ అవుతున్న లీక్‌డ్ పిక్చర్స్
Redmi Note 14 Pro
Follow us

|

Updated on: Jun 27, 2024 | 3:50 PM

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగం రోజురోజుకీ పెరుగుతుంది. అమెరికా, చైనా తర్వాత భారత్‌లోనే స్మార్ట్ ఫోన్ వినియోగం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు తమ ఫోన్లను గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ చేసిన అనంతరం భారత్‌లో లాంచ్ చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఎంఐ ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ రెడ్ మీ నోట్ 13 సిరీస్ జనవరిలో భారతదేశంలో ప్రారంభించింది. తాజాగా రెడ్ నోట్ 14 సిరీస్‌ను కూడా ఎంఐ భారత్‌లో లాంచ్ చేయనుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రెడ్ మీ నోట్ 14 సిరీస్ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో రెడ్‌మీ నోట్ 14 సిరీస్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

రెడ్ మీ నోట్ 14 సిరీస్ ఫీచర్స్ ఇవేనంటూ కొన్ని టెక్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. రెడ్ మీ నోట్ 14 ఫోన్ 50 మెగాపిక్సెల్‌తో పెద్ద ప్రైమరీ సెన్సార్‌తో వస్తుంది. అయితే ఈ ఫోన్ వెనుకవైపు టెలిఫోటో కెమెరా లేదని చెబుతున్నారు. రెడ్ మీ నోట్ 13 ప్రో మాదిరిగానే ఫోన్ మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌తో 1.5 కె రిజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే డ్యూయల్ మైక్రో-కర్వ్డ్ స్క్రీన్ అని అంచనా వేస్తున్నారు. రెడ్ మీ నోట్ 14 సిరీస్ ఫోన్ సెప్టెంబర్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఆకట్టుకుంటుంది. అలాగే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత.

ఆకట్టుకుంటున్న రెడ్ మీ నోట్ 13

ఈ ఏడాది జనవరిలో భారతదేశంలో రిలీజ్ చేసిన రెడ్ మీ నోట్ 13 ఫోన్ రూ. 25,999కు వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.67 అంగుళాల 1.5కే ఎమోఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది. అలాగే 12 జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 7 ఎస్ జెన్ 2 చిప్‌ ఆధారంగా పని చేస్తుంది. ఫోన్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,100 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు