రెడ్‌మి ఫోన్లు వాడేవారికి గుడ్ న్యూస్.. ‘K’ సిరీస్‌లో మూడు కొత్త మోడళ్ల విడుదల.. కళ్లు చెదిరే ఫీచర్స్.. చూశారంటే కొనాల్సిందే..

|

Feb 26, 2021 | 5:44 AM

Redmi Launches K40 Series : వరుస లాంఛ్‌లతో అదరగొడుతున్న రెడ్‌మీ ‘K’ సిరీస్‌లో మూడు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ కె40, కె40 ప్రో,

రెడ్‌మి ఫోన్లు వాడేవారికి గుడ్ న్యూస్.. ‘K’ సిరీస్‌లో మూడు కొత్త మోడళ్ల విడుదల.. కళ్లు చెదిరే ఫీచర్స్.. చూశారంటే కొనాల్సిందే..
Follow us on

Redmi Launches K40 Series : వరుస లాంఛ్‌లతో అదరగొడుతున్న రెడ్‌మీ ‘K’ సిరీస్‌లో మూడు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ కె40, కె40 ప్రో, కె40 ప్రో+ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా, పంచ్‌ హోల్ డిస్‌ప్లే, డాల్బీ అట్‌మోస్‌ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్స్‌ వంటి ఫీచర్స్ ఇస్తున్నారు. ఇంకా వీటిలో ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం..

1. రెడ్‌మీ కె40 : ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్‌‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఈ4 అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉపయోగించారు. మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 5 ఎంపీ మాక్రో లెన్స్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 20 ఎంపీ కెమెరా అమర్చారు. 4,520 ఎంఏహెచ్‌ బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌కి రెండు వైపుల కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు.

2. రెడ్‌మీ కె40 ప్రో & కె40 ప్రో+: ఈ ఫోన్లలో కూడా 120Hz రిఫ్రెష్‌‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ12 ఓఎస్‌తో పనిచేస్తాయి. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉపయోగించారు. 4,520 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కె40 ప్రోలో వెనక వైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ఇక కె40 ప్రో+లో వెనక వైపు 108 ఎంపీ శాంసంగ్ హెచ్‌ఎం2 సెన్సర్‌ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ, 5ఎంపీ కెమెరాలున్నాయి. రెండు ఫోన్లలో సెల్ఫీల కోసం 20 ఎంపీ కెమెరాలు అమర్చారు. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సర్ ఇస్తున్నారు.

ధర : ప్రస్తుతం చైనా మార్కెట్లో మాత్రమే ఈ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా వీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. రెడ్‌మీ కె40 6జీబీ, 8జీబీ, 12జీబీ ర్యామ్‌/128జీబీ, 256జీబీ మెమొరీ వేరియంట్లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర 1,999 యువాన్లు. భారత కరెన్సీలో సుమారు రూ. 22,500. కె40 ప్రో 6జీబీ, 8జీబీ ర్యామ్/128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌ ప్రారంభ ధర 2,799 యువాన్లు. మన కరెన్సీలో సుమారు రూ. 31,500 ఉంటుందని అంచనా. కె40 ప్రో+ 12జీబీ ర్యామ్/256జీబీ వేరియంట్ ధర 3,699 యవాన్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 41,600 ఉంటుందని అంచనా.

ఇదిలా ఉంటే రెడ్‌ మీ కంపెనీ వీటకి ముందు రెడ్ మి9 పవర్ అప్‌డేట్ తీసుకొచ్చి అందుబాటు ధరలో అందిస్తోంది. ఈ కొత్త వేరియంట్ 6GB ర్యామ్,128GB స్టోరేజీతో రిలీజ్ అయింది. గత ఏడాదిలో 4GB RAM ఆప్షన్లతో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన రెడ్ మి అదనంగా 2GB ర్యామ్ జత చేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒక ర్యామ్ మినహా ఇతర ఫీచర్లను మాత్రం సేమ్ టు సేమ్ అలానే ఉంచేసింది. ఏ మార్పు చేయలేదు.

రెడ్‌మి 9 పవర్ 6GB ర్యామ్+128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ. 12,999 మాత్రమేనట.. బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫియెరీ రెడ్, మైటీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. ఈ కామర్స్ వెబ్ సైట్లలో అమెజాన్, ఎంఐ డాట్ కామ్, ఎంఐ హోమ్స్, ఎంఐ స్టూడియోలలో ఈ కొత్త వేరియంట్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇదివరకే మార్కెట్లోకి వచ్చిన రెడ్ మి 4GB ర్యామ్+64GB వేరియంట్ ధర రూ. 10,999లకే లభ్యమవుతోంది.

రెడ్‌మి 9 పవర్ ఫీచర్లు : డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10 OS, 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, అండర్ ది హుడ్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 చిప్‌సెట్, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు,సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా, SD కార్డు 512GBకి మెమొరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 6,000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

నిండు ప్రాణాన్ని కాపాడిన హైదరాబాద్ పోలీసులు.. సకాలంలో స్పందించడంతో తప్పిన ప్రాణాపాయం.. అసలు వివరాలు ఇలా..