Redmi Note 12 Pro 5G: రెడ్‌మీ ఫోన్‌లో కొత్త వేరియంట్.. 30 నిముషాల్లోనే 100 శాతం చార్జ్.. మరిన్ని ఆప్డేట్స్.. వివరాలివే..

|

Aug 11, 2023 | 3:25 PM

Redmi Note 12 Pro 5G: కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే మీరు Redmi Note 12 Pro 5G స్మార్ట్‌ఫోన్‌‌లోని కొత్త వేరియంట్‌ని నిరభ్యంతరంగా ఎంపిక చేసుకోవచ్చు. 6 GB RAM - 128 GB ROM వేరియంట్, 8 GB RAM - 128 GB ROM వేరియంట్, 8 GB RAM - 256 GB ROM వేరియంట్లతో ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్‌లో మరో కొత్త వేరియంట్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ వేరియంట్ ధర, ఇందులోని ఫీచర్లు, స్పెసిఫెకేషన్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

Redmi Note 12 Pro 5G: రెడ్‌మీ ఫోన్‌లో కొత్త వేరియంట్.. 30 నిముషాల్లోనే 100 శాతం చార్జ్.. మరిన్ని ఆప్డేట్స్.. వివరాలివే..
Redmi Note 12 Pro 5G
Follow us on

Redmi Note 12 Pro 5G: మీరు ట్రెండీ ఫీచర్లతో పాటు అధిక RAM సామర్థ్యం కలిగిన ఫోన్ కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే మీరు Redmi Note 12 Pro 5G స్మార్ట్‌ఫోన్‌‌లోని కొత్త వేరియంట్‌ని నిరభ్యంతరంగా ఎంపిక చేసుకోవచ్చు. 6 GB RAM – 128 GB ROM వేరియంట్, 8 GB RAM – 128 GB ROM వేరియంట్, 8 GB RAM – 256 GB ROM వేరియంట్లతో ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్‌లో మరో కొత్త వేరియంట్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. 12 GB RAM – 256 GB ROM సామర్థ్యంలో నూతనంగా విడుదల చేయబడిన రెడ్మీ నోట్ 12 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ మోడల్‌‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకా ఈ వేరియంట్ ధర, ఇందులోని ఫీచర్లు, స్పెసిఫెకేషన్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

Redmi Note 12 Pro 5G Redmi స్మార్ట్‌ఫోన్‌లో మీరు 6.67 అంగుళాల పూర్తి HD ప్లస్ OLED డిస్‌ప్లే, 120 Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌, ఇది 240 Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌ను పొందుతారు. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కూడా డిస్‌ప్లే సెక్యూరిటీ కోసం అందించారు. వేగం, ఇంకా మల్టీ టాస్కింగ్ కోసం ఈ Redmi Note 12 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో  MediaTek Dimensity 1080 ప్రాసెసర్ ఉపయోగించబడింది. ఇక కెమెరా విషయానికి వస్తే ఫోన్ వెనుక ప్యానెల్‌లో 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా సెన్సార్‌తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 కెమెరా సెన్సార్ ఉన్నాయి. అలాగే వీడియో కాల్స్, సెల్ఫీ ఈ రెడ్మీ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 16 మెగా పిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ బ్యాకప్‌ని ఈ ఫోన్ కలిగి ఉంది. విశేషమేమిటంటే.. ఈ ఫోన్ కేవలం 15 నిమిషాల్లో 51 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. అంటే మొత్తం 30 నిముషాల్లోనే పూర్తి చార్జ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ వివరాలు.. 

భారత‌లో Redmi Note 12 Pro 5G స్మార్ట్‌ఫోన్ ధర

రెడ్మీ కంపెనీ సరికొత్త వేరియంట్‌గా విడుదల చేసిన ఈ 12 GB RAM – 256 GB ROM మొబైల్ ఫోన్‌ ధరను 28,999 రూపాయలుగా నిర్ణయించబడింది. ఇక ఈ ఫోన్‌ వేరియంట్‌ను మీరు MI.com లేదా, Flipkart నుంచి మీరు కొనుగోలు చేయవచ్చు. ఇక ఇతర వేరియంట్‌ల ధరలు ఎలా ఉన్నాయంటే.. 6 GB RAM – 128 GB ROM వేరియంట్ ధర రూ. 23,999.., 8 GB RAM – 128 GB ROM వేరియంట్ ధర రూ. 24,999 , 8 GB RAM – 256 GB ROM వేరియంట్ ధర రూ. 26,999 గా ఉన్నాయి.