Realme 10 Series: రియల్‌మీ 10 సిరీస్‌ లాంచ్‌కి టైమ్‌ ఫిక్స్‌.. నెట్టింట లీక్‌ అయిన ఫీచర్లు..

|

Oct 28, 2022 | 2:19 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటికే బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌ను పరిచయం చేసిన రియల్‌మీ తాజాగా 10 సిరీస్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయమై తాజాగా రియల్‌ ట్విట్టర్‌ వేదికగా...

Realme 10 Series: రియల్‌మీ 10 సిరీస్‌ లాంచ్‌కి టైమ్‌ ఫిక్స్‌.. నెట్టింట లీక్‌ అయిన ఫీచర్లు..
Realme 10 Series
Follow us on

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటికే బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌ను పరిచయం చేసిన రియల్‌మీ తాజాగా 10 సిరీస్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయమై తాజాగా రియల్‌ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ఓ ప్రకటన చేసింది. పనితీరు, డిజైన్‌, డిస్‌ప్లే ఇలా ఈ మూడు అంశాల్లో మెరుగైన ఫీచర్లతో 10 సిరీస్‌ రానుందని రియల్‌మీ తెలిపింది. రియల్‌మీ సిరీస్‌లో భాగంగా రియల్‌మీ 10, రియల్‌ మీ 10 ప్రో+ను నవంబర్‌లో లాంచ్‌ చేయనున్నారు. మొదట చైనాలో ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్‌ అందుబాటులోకి రానున్నట్లు సమచారం.

ఇదిలా ఉంటే రియల్‌మీ 10 సిరీస్‌ ఫోన్‌లకు సంబంధించిన ఫీచర్లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ వివరాల ప్రకారం.. రియల్‌ మీ 10 స్మార్ట్‌ఫోన్‌ను 4జీ వెర్షన్‌లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇక స్టోరేజ్‌ విషయానికొస్తే ఇందులో 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను ఇవ్వనున్నారు. అలాగే బ్యాటరీ అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 33 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక రియల్‌ మీ 10 ప్రో+ ఫీచర్ల విషయానికొస్తే 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ ఫోన్‌ స్టోరేజ్‌ విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను అందించనున్నారని టాక్‌. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ డైమెన్సిటీ 1080 చిప్‌సెట్‌ ద్వారా పనిచేయనుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 67 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..