Realme Flash: ఆ ఫీచర్‌తో రానున్న తొలి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఇదే.. మరో సంచలనానికి సిద్ధమవుతోన్న రియల్ మీ..

Realme Flash: స్మార్ట్‌ ఫోన్‌ తయారీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది రియల్‌ మీ. చైనాకు చెందిన ఈ ప్రముఖ సంస్థ భారత స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో మెజారిటీ వాటాను దక్కించుకుంది...

Realme Flash: ఆ ఫీచర్‌తో రానున్న తొలి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఇదే.. మరో సంచలనానికి సిద్ధమవుతోన్న రియల్ మీ..
Realme New Phone

Updated on: Jul 28, 2021 | 8:17 AM

Realme Flash: స్మార్ట్‌ ఫోన్‌ తయారీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది రియల్‌ మీ. చైనాకు చెందిన ఈ ప్రముఖ సంస్థ భారత స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో మెజారిటీ వాటాను దక్కించుకుంది. ఇప్పటికే ఎన్నో అద్భుత ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొంగొత్త ఫోన్‌లను పరిచయం చేస్తున్న రియల్‌ మీ తాజాగా మరో సంచలనానికి తెర తీసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో లేని ఫీచర్‌తో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానుంది. రియల్‌ మీ ఫ్లాష్‌ పేరుతో త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్‌కు సంబంధించి అధికారిక ప్రకటనను రియల్‌ మీ ఇండియా సీఈఓ మాధవ్‌ శ్వేత్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. మ్యాగ్నటిక్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌తో వస్తోన్న ప్రపంచంలోనే తొలి ఆండ్రాయిడ్‌ ఫోన్‌గా రియల్‌ మీ ఫ్లాష్‌ను తీసుకొస్తున్నట్లు మాధవ్‌ తెలిపారు.

రియల్‌ మీ ఫ్లాష్‌ ఫీచర్లు ఇలా ఉండనున్నాయి..

* త్వరలోనే విడుదల కానున్న ఈ కొత్త ఫోన్‌లో స్నాప్‌ డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు సమాచారం.
* ఈ ఫోన్‌కు సపోర్ట్‌ చేసే విధంగా మాగ్‌డార్ట్‌ వైర్‌లెస్‌ ఛార్జర్‌ను కూడా రియల్‌ మీ లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.
* ఈ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్‌ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 256 జీబీ ర్యామ్‌ను అందించనున్నారు.
* కర్వ్‌డ్‌ స్క్రీన్‌తో పాటు కార్నర్‌ పంచ్‌ హోల్‌ కెమెరాను అందించనున్నారు.
* ఈ ఫోన్‌లో ట్రిపుల్‌ రియర్‌ కెమెరాను అందించనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌ను ఎప్పుడు విడుదల చేయనున్నారన్న దానిపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read: Twitter Voice: ఇకపై టైపింగ్‌ చేయాల్సిన అవసరం లేదు, చెబితే చాలు.. ట్విట్టర్‌లో మరో అద్భుత ఫీచర్‌..

Smart Watch: వర్షంలో తడిచినా.. ఏమాత్రం పాడవని 5 స్మార్ట్ వాచ్‌లు..మీ బడ్జెట్ లోనే!

Realme Watch 2: భారత మార్కెట్లోకి రియల్‌ మీ స్మార్ట్‌ వాచ్‌లు.. ఆఫర్‌లో ప్రారంభ ధర రూ. 2,999.. ఫీచర్లపై ఓ లుక్కేయండి..