Realme Smartphone: అతి తక్కువ ధరలోనే 12జీబీ ర్యామ్.. 100ఎంపీ కెమెరా.. రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ మామూలుగా లేదుగా..

రియల్ మీ 11 ప్రో 5జీ ఫోన్ కి మన దేశంలో సేల్ ప్రారంభమైంది. దీని ధర రూ. 23,999గా ఉంది. దీనిలో ప్రత్యేకతలు గురించి మాట్లాడితే 120హెర్జ్ అమోల్డ్ డిస్ ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంటుంది.

Realme Smartphone: అతి తక్కువ ధరలోనే 12జీబీ ర్యామ్.. 100ఎంపీ కెమెరా.. రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ మామూలుగా లేదుగా..
Realme 11 Pro 5g
Follow us
Madhu

|

Updated on: Jun 17, 2023 | 3:50 PM

టెక్ ప్రపంచంలో 5జీ ట్రెండ్ షురూ అయ్యింది. అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అన్ని స్మార్ట్ ఫోన్ల కంపెనీలు కొత్తగా లాంచ్ చేసే తమ ఉత్పత్తులను అనివార్యంగా 5జీలోనే తీసుకొస్తున్నాయి. దీంతో మార్కెట్లో పెద్ద ఎత్తున 5జీ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ఇదే క్రమంలో రియల్ మీ కొత్త 5జీ ఫోన్ ని లాంచ్ చేసింది. రియల్ మీ 11 ప్రో 5జీ ఫోన్ కి మన దేశంలో సేల్ ప్రారంభమైంది. దీని ధర రూ. 23,999గా ఉంది. దీనిలో ప్రత్యేకతలు గురించి మాట్లాడితే 120హెర్జ్ అమోల్డ్ డిస్ ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంటుంది. అలాగే వెనుకవైపు 100ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్, ర్యామ్ సైజ్ 12జీబీతో ఈ ఫోన్ వస్తుంది. ప్రస్తుతం ఇది ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రియల్ మీ 11 ప్రో 5జీ ధర, లభ్యత..

రియల్ మీ 11 ప్రో 5జీ అనేది మూడు వేరియంట్లలో వస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో వచ్చే ఫోన్ దర రూ. 23,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. అదే విధంగా 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆస్ట్రల్ బ్లాక్, సన్ రైజ్ బీజ్ కలర్ ఆప్షన్లలో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. అలాగే త్వరలో ఒయాసిస్ గ్రీన్ కలర్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది.

రియల్ మీ 11 ప్రో 5జీ పై ఆఫర్లు..

ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ అలాగే రియల్ మీ అధికారిక వెబ్ సైట్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు హెచ్ డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులను వినియోగించి 8జీబీ, 128జీబీ వేరియంట్ కొనుగోలు చేస్తే రూ. 1500 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

రియల్ మీ 11 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు..

ఈ రియల్ మీ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ ప్లస్ కర్వడ్ అమోల్డ్ డిస్ ప్లే, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే రియల్ మీ 11 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ లో వెనుకవైపు 100ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే సెల్ఫీలకు వీడియో కాల్స్ కు ముందు వైపు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..