Best Tablets Under 30k: జియోమీ నుంచి యాపిల్ వరకూ.. మిడ్ రేంజ్‌లో బెస్ట్ ట్యాబ్లెట్లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి..

మీరు అనువైన బడ్జెట్లో మంచి ట్యాబ్లెట్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇటీవల లాంచ్ అయిన జియోమీ ప్యాడ్ 6 ట్యాబ్లెట్ మంచి ఆప్షన్. ఎందుకంటే ఇది మీకు రూ. 30,000లోపు ధరలోనే లభిస్తుంది. అయితే ఇదే రేంజ్ బడ్జెట్లో ఈ ట్యాబ్లెట్ కి మంచి ప్రత్యామ్నాయాలు కూడా చాలానే ఉన్నాయి.

Best Tablets Under 30k: జియోమీ నుంచి యాపిల్ వరకూ.. మిడ్ రేంజ్‌లో బెస్ట్ ట్యాబ్లెట్లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి..
Xiaomi Pad 6
Follow us
Madhu

|

Updated on: Jun 17, 2023 | 4:15 PM

మీరు అనువైన బడ్జెట్లో మంచి ట్యాబ్లెట్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇటీవల లాంచ్ అయిన జియోమీ ప్యాడ్ 6 ట్యాబ్లెట్ మంచి ఆప్షన్. ఎందుకంటే ఇది మీకు రూ. 30,000లోపు ధరలోనే లభిస్తుంది. అయితే ఇదే రేంజ్ బడ్జెట్లో ఈ ట్యాబ్లెట్ కి మంచి ప్రత్యామ్నాయాలు కూడా చాలానే ఉన్నాయి. వాటిల్లో బెస్ట్ ఒక అయితే ట్యాబ్లెట్ల మీకు పరిచయం చేస్తాం. అంతకన్నా ముందు అసలు జియోమీ ప్యాడ్ 6 ఫుల్ స్పెసిఫికేషన్లు, ధర, లభ్యత వంటి పూర్తి వివరాలు చూద్దాం..

జియోమీ ప్యాడ్ 6..

ఈ టాబ్లెట్ 11-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది అంగుళానికి 309 పిక్సెల్‌ల సాంద్రతతో 2880×1880 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తుంది. జియోమీ ప్యాడ్ 6 ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 870 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ టాబ్లెట్ 8600ఎంఏహెచ్ బ్యాటరీతో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై నడుస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ నిల్వతో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2-మెగాపిక్సెల్ మరో కెమెరా కూడా ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ గ్రాఫైట్ గ్రే, మిస్ట్ బ్లూ అనే రెండు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ధర మనదేశంలో రూ.26,999గా ఉంది.

జియోమీ ప్యాడ్ 6కు బెస్ట్ ప్రత్యామ్నయాలు ఇవే..

జియోమీ ప్యాడ్ 6లో ఉన్న ఫీచర్లు, స్పెసిఫికేషన్లు రూ. 30,000లోపు బడ్జెట్లో బెస్ట్ ఎంపికగా నిలుస్తోంది. అయితే ఇదే ధరలో దీనికి సమానంగా ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో మరిన్ని మోడళ్లు మార్కెట్లో ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి..

ఇవి కూడా చదవండి

జియోమీ ప్యాడ్ 5.. జియోమీ నుంచే వస్తున్న మరో మధ్య శ్రేణి ట్యాబ్లెట్ ఇది. దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుంది. ఇది వినియోగదారులకు మంచి గేమింగ్ పనితీరును అందిస్తుంది. 120హెర్జ్ డిస్ప్లేతో పాటు మెరుగైన వీక్షణ అనుభవం కోసం డాల్బీ విజన్‌కు మద్దతు ఇస్తుంది.

జియోమీ ట్యాబ్ 5.. ఇది 11-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. దాదాపు జియోమీ ప్యాడ్ 6 వలే ఉంటుంది. ఇది 6జీబీ ర్యామ్ ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. వెనుకవైపు 13-మెగాపిక్సెల్, ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. దీని ధర 128జీబీ రూ. 26,999, 256జీబీ వేరియంట్ ధర రూ. 28,499గా ఉంది.

రియల్ మీ ప్యాడ్ ఎక్స్.. దీనిని ప్రీమియం ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లలో ఒకటిగా పిలుస్తారు. ఇది భారతదేశంలో అనేక స్టోరేజ్, కనెక్టివిటీ వేరియంట్‌లను కలిగి ఉంది. దీనికి 5జీ సపోర్టు ఉంటుంది. దీనిలో11-అంగుళాల WUXGA+ రిజల్యూషన్‌తో పాటు స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్ ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే 8340ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది చాలా స్లిమ్, అలాగే వెయిట్ లెస్. దీని ధర కేవలం రూ. 19,999గా ఉంది.

యాపిల్ ఐ ప్యాడ్.. దీనిలో 10.2-అంగుళాల లెడ్-బ్యాక్‌లిట్ మల్టీ-టచ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది యాపిల్ ఏ 13 బయోనిక్ ద్వారా పనిచేస్తుంది. వెనుక వైపు 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ ఐప్యాడ్ ఓఎస్ 15తో నడుస్తుంది. యాపిల్ పెన్సిల్, స్మార్ట్ కీబోర్డ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 64జీబీ వేరియంట్ ధర రూ. 27,900గా ఉంది.

లెనోవా ట్యాబ్ పీ11 ప్లస్.. దీనిలో 11-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 2000×1200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఇది ఆక్టా-కోర్ ఆక్టాకోర్ మీడియాటెక్ జీ90సీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచస్తుంది. 4జీబీ ర్యామ్ తో ప్యాక్ చేయబడింది. 7500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో పనిచేస్తుంది. మోడ్రనిస్ట్ టీల్, ప్లాటినమ్ గ్రే, స్టేట్ గ్రే వంటి కలర్ ఆప్షన్లలో నడుస్తోంది. 128జీబీ వేరియంట్ ధర రూ. 26,950గా ఉంది.

ఒప్పో ప్యాడ్.. ఒప్పో ప్యాడ్ మార్చి, 2022లో మార్కెట్లోకి వచ్చింది. ఈ ట్యాబ్లెట్ 1600×2560 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 10.95-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించింది. ప్యాడ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. టాబ్లెట్ ఆండ్రాయిడ్ 11కి మద్దతు ఇస్తుంది. 8360ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. వెనుకవైపు 13-మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8-మెగాపిక్సెల్ కెమెరాతో పనిచేస్తుంది. 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తున్న దీని ధర రూ.22,490గా ఉంది. .

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే