Real Me Laptop: రియల్‌మీ జూన్ 15 న ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. ఎన్నాళ్ళుగానో చెబుతూ వస్తున్న అత్యంత ఆధునిక లాప్ టాప్ ఆరోజు లాంచ్ చేయబోతోంది. తన మొదటి జిటి 5 జి ఫ్లాగ్‌షిప్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆరోజు ప్రారంభించనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. రియల్‌మీఫ్లాగ్‌షిప్ పరికరాన్ని లాంచ్ చేయడమే కాకుండా, జూన్ 15 లాంచ్ ఈవెంట్‌లో మొట్టమొదటిసారిగా టాబ్లెట్, ల్యాప్‌టాప్‌ను విడుదల చేస్తుంది. దీంతో ఇకపై రియల్ మీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా మాత్రమే మిగిలిపోదు. టాబ్లెట్, ల్యాప్ టాప్ రంగంలోనూ తన సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది.
ఇప్పటి వరకూ రియల్ మీ తన సోషల్ మీడియా ఖాతాలలో ల్యాప్‌టాప్, టాబ్లెట్‌ను లాంచ్ చేసినట్లు ధృవీకరించలేదు, కాని, దాని గురించి ప్రధాన సూచనలను పత్రికా ప్రకటనల్లో తెలియచేసింది. రియల్ మీ తన స్మార్ట్‌ఫోన్ వ్యాపారం “ఎంతో ఎత్తుకు” పెరిగిందని ఆ ప్రకటనలో పేర్కొంది, అయితే ఇప్పుడు కంపెనీ మరింత “లీప్-ఫార్వర్డ్ ఉత్పత్తులను” తీసుకువచ్చే సమయం వచ్చిందని చెబుతోంది. అంతకుముందు.. ఇంతకుముందు, రియల్ మీ ఇండియా సీఈఓ మాధవ్ శేత్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రియల్ మీ ల్యాప్‌టాప్ కు సంబంధించిన విషయాలు షేర్ చేశారు.
ఆయన తన ట్వీట్ లో “# కొత్త ఉత్పత్తి వర్గం మీ కోసం ఒక సందేశాన్ని కలిగి ఉంది! మీరు దీన్ని డీకోడ్ చేయగలరా? మీ # టెక్ లైఫ్ వరకు జోడించే ఉత్పత్తి పేరును? ఊహించగలరా? ” అని పేర్కొన్నారు. ఈయన పోస్ట్ తర్వాత రియల్ మీ ల్యాప్‌టాప్ లీకైన చిత్రాలతో ఇంటర్నెట్ నిండిపోయింది. ఈ సంస్థ తన లాప్ టాప్ ను రియల్ మీ బుక్ అని పిలుస్తోంది.
రియల్ మీ బుక్ మాక్‌బుక్ ఎయిర్ నుండి టెక్నాలజీ సూచనలు తీసుకున్నట్లు లీక్‌లు వెల్లడిస్తున్నాయి. ఇది మాక్‌బుక్‌లోకి వచ్చే అదే వెండి రంగు, అల్యూమినియం బాడీని కలిగి ఉంది. రియల్ మీ బుక్‌లో సరిగ్గా ఏ మెటీరియల్ వాడారో ఇంకా స్పష్టంగా తెలియదు, వ్యాఖ్యానం పూర్తిగా ఉత్పత్తి యొక్క రెండర్‌లపై ఆధారపడి ఉంటుంది. రియల్ మీ బుక్ రూపకల్పన ఈమధ్య లీక్ అయినప్పటికీ, ల్యాప్‌టాప్ ప్రత్యేకతల గురించి పెద్దగా తెలియదు. రియల్ మీ ల్యాప్‌టాప్‌ను రియల్ మీ స్మార్ట్‌ఫోన్‌లతో లోతుగా విలీనం చేయనున్నట్లు సమాచారం.
రియల్ మీ బుక్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. రియల్ మీ టాబ్లెట్ బాగా కాపలాగా ఉన్న రహస్యంలా ఉంది. ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం, టాబ్లెట్‌ను రియల్‌మే ప్యాడ్ అని పిలుస్తారు. డిజైన్ పరంగా, రియల్ మీ ప్యాడ్ ఆపిల్ ఐప్యాడ్ నుండి కూడా పెద్ద ప్రేరణ పొంది ఉండవచ్చని అంటున్నారు. హై-ఎండ్ ఫీచర్‌తో ఇది వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. అయితే, పూర్తి వివరాలు కంపెనీ ఉత్పత్తిని ఆవిష్కరించినప్పుడే తెలిసే అవకాశం ఉంది.
రియల్ మీ ఇండియా సీఈఓ మాధవ్ శేత్ ట్వీట్..
The #realmeGT will feature the power-packed Snapdragon 888; a game-changer in the fields of 5G, AI, gaming & photography.
Get ready for this ultimate #FlagshipKiller2021, launching globally on 15th June.#SheerSpeedFlagship pic.twitter.com/e1X5JMBblT
— Madhav Max 5G (@MadhavSheth1) June 10, 2021
Also Read: Samsung New Galaxy: సామ్‌సంగ్ న్యూ బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..