Poco X7 లాంచ్ తేదీ ఖరారు.. ధర, ఫీచర్స్‌ఎలా ఉన్నాయో తెలుసా..?

|

Dec 31, 2024 | 8:46 PM

Poco X7: మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ ఫోన్లు విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ట్రెండింగ్‌ ఉన్న నేపథ్యంలో మొబైల్‌ తయారీ కంపెనీలు అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మొబైళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇక Poco నుంచి కూడా అద్భుతమైన ఫోన్లు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో మెడల్‌ విడుదల కానుంది..

Poco X7 లాంచ్ తేదీ ఖరారు.. ధర, ఫీచర్స్‌ఎలా ఉన్నాయో తెలుసా..?
Follow us on

కొత్త సంవత్సరంలో ఫోన్‌ల కోసం చూస్తున్న వ్యక్తులు అనేక ఫోన్లు విడుదల కానున్నాయి. ఇందులో భాగంగా Poco తన Poco X7 ప్రారంభ తేదీని ప్రకటించింది. Poco X7, Poco X7 Pro ఈ సిరీస్‌లో ఉండనున్నాయి. దీన్ని జనవరి 9, 2025 సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభించనున్నట్లు కంపెనీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ రెండు ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయని Poco స్పష్టం చేసింది. ఈ సిరీస్‌లో మూడవ నియో వేరియంట్ కూడా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అయితే పోకో ఇండియా హెడ్ హిమాన్షు టాండన్ ఈ ఊహాగానాలకు ముగింపు పలికారు.

Poco X7: స్పెసిఫికేషన్‌లు:

Poco X7 గురించి ఆయన మాట్లాడుతూ.. బేస్ మోడల్‌లో MediaTek డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్ ఉన్నట్లు నివేదించారు. ఫోన్ గరిష్టంగా 12GB RAM, 512GB ఇంటర్నల్‌ స్టోరేజీతో రావచ్చు. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. బలమైన డిస్‌ప్లే కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ ఫోన్ మంచి ఆప్షన్‌.

ఇవి కూడా చదవండి

Poco X7 ప్రో గురించి మాట్లాడితే.. ఇది శక్తివంతమైన MediaTek డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని, రెండు ఫోన్‌లు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రావచ్చని తెలుస్తోంది.

Poco X7: బ్యాటరీ, ధర

Poco రెండు ఫోన్‌లు IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వచ్చే అవకాశం ఉంది. దీని ధర రూ.30,000 లోపే ఉంటుందని భావిస్తున్నారు. దీనికి ముందు ప్రారంభించిన Poco X6, X6 ప్రో ప్రారంభ ధర వరుసగా రూ. 21,999, రూ. 26,999 ఉండే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: మద్యం ప్రియులకు కిక్కిచ్చే వార్త.. వైన్స్‌ షాపులు, బార్ల సమయ వేళల పొడిగింపు!

ఇది కూడా చదవండి: Banks Holiday: కొత్త సంవత్సరం జనవరి 1న బ్యాంకులు మూసి ఉంటాయా..? లేదా?

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి