స్మార్ట్ ఫోన్లలో చాలా రకాల మోడళ్లు ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో ఫోన్లకు మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి. ఇదే క్రమంలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ కూడా స్మార్ట్ ఫోన్ల రంగంలోకి కొంత కాలం క్రితం అడుగుపెట్టింది. గూగుల్ పిక్సల్ 6ఏ పేరిట ఓ మొబైల్ ను లాంచ్ చేసింది. అలాగే గూగుల్ పిక్సల్ 7ఏ, గూగుల్ పిక్సల్ ఫోల్డ్ పేరిట మరో రెండు వేరియంట్లను గూగుల్ త్వరలో లాంచ్ చేయనుంది. అయితే అత్యాధునిక ఫీచర్లుండే ఈ గూగుల్ ఫోన్ల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ గూగుల్ పిక్సల్ 6ఏ ఫోన్ పై అదిరి ఆఫర్ ను అందిస్తోంది. రూ. 43,999 లుండే ఫోన్ ని కేవలం రూ. 749కే అందిస్తోంది. ఈ ఆఫర్ పూర్తి వివరాలు, గూగుల్ పిక్సల్ 6ఏ ఫోన్ స్పెక్స్, ఫీచర్లు గురించి తెలుసుకుందాం..
ఈ ఫోన్ లో 6.1 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ హెచ్ డీఆర్ డిస్ ప్లే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రోటెక్షన్ తో ఈ ఫోన్ వస్తుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఇది వస్తుంది. కెమెరా విషయానికి వస్తే దీనిలో వెనుక వైపు 12ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ప్రస్తతం ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ. 749కే కొనుగోలు చేయొచ్చు. అదెలాగో చూద్దాం రండి..
గూగుల్ పిక్సల్ 6ఏ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ఆఫర్ లో రూ. 28,999 ఉంది. అసలు ధర రూ. 43,999 కాగా రూ. 15,000 డిస్కౌంట్ పోనూ ఈ ధరకు ఫోన్ వస్తుంది. అలాగే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు పై ఫోన్ కొనుగోలు చేస్తే 1,449 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది కాకమీ పాత ఫోన్ ని ఎక్స్ చేంజ్ చేస్తే మరింత తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ మీ పాత ఫోన్ కండీషన్ బట్టి ఉంటుంది. ఒకవేళ మీ పాత మొబైల్ కండిషన్ బాగుంటే దాదాపు రూ. 27,250 వరకూ ఫోన్ ధర తగ్గుతుంది. అంటే ఈ ఆఫర్లన్నీ వినియోగించుకుంటే మీకు గూగుల్ పిక్సల్ 6ఏ ఫోన్ కేవలం రూ. 749కే పొందవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..