మారుతి వాగనర్ కారును ఎలా మార్చాడో చూడండి..! అతి తక్కువ ధరలో అతి పెద్ద కారు.. వైరల్‌ అవుతున్న వీడియో..

|

Apr 13, 2021 | 10:29 AM

Pakistani Man Converts Maruti Wagonr : కారును మార్చడం చాలా సాధారణం. కానీ మారుతి సుజుకి వాగనర్ వంటి కారును లిమోసిన్‌గా మార్చాలని ఎప్పుడైనా అనుకున్నారా..? ఈ ఆలోచన మీ మనసులోకి

మారుతి వాగనర్ కారును ఎలా మార్చాడో చూడండి..! అతి తక్కువ ధరలో అతి పెద్ద కారు.. వైరల్‌ అవుతున్న వీడియో..
Wagonr Mini Limousine
Follow us on

Pakistani Man Converts Maruti Wagonr : కారును మార్చడం చాలా సాధారణం. కానీ మారుతి సుజుకి వాగనర్ వంటి కారును లిమోసిన్‌గా మార్చాలని ఎప్పుడైనా అనుకున్నారా..? ఈ ఆలోచన మీ మనసులోకి రాకపోయినా పాకిస్తాన్‌లో నివసిస్తున్న మహ్మద్ ఇర్ఫాన్ ఉస్మాన్ అనే వ్యక్తి ఈ ఘనత సాధించాడు. ఇర్ఫాన్ తన చిన్న వాగనర్ కారును కొన్ని రూపాయలు పెట్టుబడిగా పెట్టి లిమోసిన్ గా మార్చాడు. ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కారు వాగనర్‌ను లిమోసిన్‌గా మార్చిన ఇర్ఫాన్.. ఆటోమొబైల్ రంగానికి చాలా కాలంగా సంబంధం కలిగి ఉన్నాడు. అతను 1977లో పాకిస్తాన్‌లోని కార్ వర్క్‌షాప్‌లో తన పనిని ప్రారంభించాడు తరువాత సౌదీకి వెళ్లి అక్కడ ఆటోమొబైల్ రంగంలో 35 సంవత్సరాలు పనిచేశాడు.

వాగనర్‌ను లిమోసిన్‌గా మార్చాలనే ఆలోచన చాలా సంవత్సరాలుగా ఉందని కానీ అది చేయలేమని చెప్పాడు. పాకిస్తాన్ వచ్చిన తరువాత అతను దానిపై పని చేయడానికి సమయం కేటాయించాడు. ఈ పని చేసేముందు అతడు గూగుల్‌ను శోధించి మరొకరు దానిపై పని చేశారో లేదో ధృవీకరించారు. ఆ తర్వాత అతను దానిపై పనిచేయడం ప్రారంభించాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇర్ఫాన్ 2015 మోడల్‌ను ఉపయోగించారు. ఈ కారును పెద్దదిగా చేయడానికి ఇర్ఫాన్ ముందు, వెనుక విభాగాలను అసలు రూపంలో ఉపయోగించారు. అదే సమయంలో కారు పొడవును పెంచడానికి మధ్య విభాగం దానికి కలిపాడు. దీనికోసం అసలు సుజుకి భాగాలు వినియోగించాడు. వీటిలో మధ్య తలుపు, పైకప్పు, పైలాస్టర్లు, సీట్లు ఉన్నాయి. ఈ కారును తయారు చేయడానికి 3 నెలల సమయం 5 లక్షల పాకిస్తాన్ రూపాయిలు (సుమారు 2.27 లక్షల భారతీయ రూపాయలు) పట్టింది. ఈ క్రింది వీడియోలో మీరు ఈ కారును చూడవచ్చు.

ఈ కారు మొత్తం పొడవు 14.5 అడుగులు. ఈ కారుకు జోడించిన మధ్య విభాగం పొడవు 3 అడుగుల 7 అంగుళాలు. ఇది కాకుండా 6 మంది కూర్చునే స్థలం ఉంది. ఈ కారు మొత్తం 500 కిలోల వరకు భారాన్ని తట్టుకోగలదు. మిడిల్ సెక్షన్ కాకుండా దానిలోని అన్ని భాగాలు ఒరిజినల్‌. దీనికి 660 సిసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇంజన్ ఉంది. ఇర్ఫాన్ ప్రకారం.. అతను ఈ కారును 120 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. హైవేలో ఇది లీటరుకు 20 కిలోమీటర్లు, నగరంలో 14 నుంచి 15 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇర్ఫాన్ ఈ కారును 26 లక్షల పాకిస్తాన్ రూపాయిలకు విక్రయిస్తున్నారు. ఇది భారత రూపాయి ప్రకారం 12 లక్షలు. భారతదేశంలో కొత్త వాగనర్‌ ధర గురించి మాట్లాడిత రూ .4.45 లక్షల నుంచి రూ .5.94 లక్షల మధ్య ఉంటుంది.