Oppo: కనిపించదు, కానీ ఉంటుంది.. మరో అద్భుతానికి తెర తీసిన ఒప్పో.. అండర్‌ డిస్‌ ప్లే పేరుతో సరికొత్త ఫీచర్‌.

|

Aug 08, 2021 | 6:48 PM

Oppo Under Screen Camera: స్మార్ట్‌ ఫోన్‌ తయారీ రంగంలో తీవ్రమైన పోటీ కారణంగా మార్కెట్లోకి రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వస్తోంది. ఈ రేస్‌లో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్పో మొదటి వరుసలో నిలుస్తోంది..

Oppo: కనిపించదు, కానీ ఉంటుంది.. మరో అద్భుతానికి తెర తీసిన ఒప్పో.. అండర్‌ డిస్‌ ప్లే పేరుతో సరికొత్త ఫీచర్‌.
Oppo New Feature
Follow us on

Oppo Under Screen Camera: స్మార్ట్‌ ఫోన్‌ తయారీ రంగంలో తీవ్రమైన పోటీ కారణంగా మార్కెట్లోకి రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వస్తోంది. ఈ రేస్‌లో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్పో మొదటి వరుసలో నిలుస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను పరిచయం చేస్తూ దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా అండర్‌ డిస్‌ ప్లే పేరుతో మరో అద్భుతానికి తెరతీసింది ఒప్పో. సాధరాణంగా స్మార్ట్‌ ఫోన్‌కు ముందు భాగంలో ఉండే సెల్ఫీ మనందరికీ తెలిసిందే. ఒప్పో గతంలో పాప్‌ అప్‌ సెల్ఫీని పరిచయం చేసింది. అయితే ఈ కెమెరా మనకు కనిపిస్తుంది. కానీ ఒప్పో తాజాగా సెల్ఫీ కెమెరా కోసం అండర్‌ డిస్‌ ప్లే పేరుతో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది.

ఒప్పో ఈ ఫీచర్‌కు నెక్ట్స్‌ జనరేషన్‌ అండర్‌ స్క్రీన్‌ కెమెరా (యూఎస్‌సీ) అనే పేరు పెట్టింది. ఈ ఫీచ‌ర్ వ‌ల్ల స్క్రీన్ క్వాలిటీ, కెమెరా ఇమేజ్ క్వాలిటీని ప‌ర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకోవ‌చ్చని ఒప్పో తెలిపింది. ఈ ఫీచర్‌తో వచ్చిన ఫోన్‌లలో ఫ్రంట్‌ కెమెరా స్క్రీన్‌తో కలిసిపోతుంది. సెల్ఫీ కెమెరా ఉన్నట్లు కూడా కనిపించదు. కానీ సెల్ఫీ మోడ్‌ ఆన్‌ చేయగానే చిన్న లైట్‌ వస్తుంది. ఫ్రంట్‌ కెమెరా ఆన్‌ అయిందని తెలుసుకోవడానికి ఇదొక ఇండికేషన్‌లా పనిచేస్తుంది. త్వరలోనే ఒప్పో నుంచి వచ్చే అన్ని స్మార్ట్‌ ఫోన్‌లలో ఈ ఫీచర్‌ను జోడిస్తామని ఒప్పో ప్రకటించింది. ఈ టెక్నాలజీపై ఇతర కంపెనీలు కూడా ఇప్పటికే ప్రయోగాలు మొదలు పెట్టినా ఒప్పోనే ఇందులో ముందు వరుసలో నిలిచింది. అయితే చైనాకు చెందిన జెడ్‌టీఈ ఇప్పటికే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినా అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. సెన్సార్‌ సరిగ్గా పనిచేయకపోవడం, ఇమేజ్‌ క్వాలిటీ దెబ్బతినడం లాంటి సమస్యలు వచ్చాయి.

Also Read: RRR: ఉక్రెయిన్‌‌‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఆర్ఆర్ఆర్.. ఫోటో షేర్ చేసిన హాలీవుడ్ హీరోయిన్

ఒలంపిక్స్ పతక విజేతలకు ఉచిత ప్రయాణ సౌకర్యం..రెండు ఎయిర్ లైన్స్ సంస్థల ప్రకటన

Trailer Talk: అసలు సూర్యకు ఏమైంది.. అతను కనబడకుండా పోవడానికి కారణమేంటి? ఆసక్తికరంగా సునీల్‌ సినిమా ట్రైలర్‌.