Oppo Watch Free: 5 నిమిషాల ఛార్జ్‌తో రోజంతా పనిచేసే ఒప్పో కొత్త వాచ్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే?

|

Feb 05, 2022 | 4:57 PM

వాచ్‌లో 1.64-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 14 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుందని కంపెనీ తెలిపింది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది.

Oppo Watch Free: 5 నిమిషాల ఛార్జ్‌తో రోజంతా పనిచేసే ఒప్పో కొత్త వాచ్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే?
Oppo Watch Free
Follow us on

Oppo Watch Free: ఒప్పో తన కొత్త వాచ్ ఫ్రీ స్మార్ట్‌వాచ్‌(Smartwatch)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. వాచ్‌లో 1.64-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 14 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుందని కంపెనీ తెలిపింది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌లో, ఇది ఒక రోజు బ్యాకప్ అందిస్తుంది. దీంతోపాటు ఒప్పో(Oppo) వైర్‌లెస్ ఎన్కో M32 నెక్‌బ్యాండ్‌ను గ్రీన్ కలర్‌లో కూడా విడుదల చేసింది. కంపెనీ గత నెలలో ఈ నెక్‌బ్యాండ్‌ను విడుదల చేసింది.

Oppo వాచ్ ఫ్రీ ధర..
కంపెనీ ఈ స్మార్ట్ వాచ్‌ను సింగిల్ కవర్ స్ట్రాప్‌లో విడుదల చేసింది. దీని ధర రూ.5,999గా పేర్కొంది. అయితే అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో మాత్రం చెప్పలేదు. ఈ వాచ్ గతేడాది సెప్టెంబర్‌లో చైనాలో విడుదలైంది. అక్కడ దీని ధర CNY 549 (దాదాపు రూ. 6,400)గా ఉంది. మరోవైపు, Oppo ఫిబ్రవరి 9 లోపు Enco M32 గ్రీన్ కలర్ వేరియంట్‌ను రూ. 1,499కి కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఆ తర్వాత ఈ నెక్‌బ్యాండ్ ధర రూ.1,799గా ఉంటుందని తెలిపింది.

Oppo వాచ్ ఫీచర్లు..
ఈ వాచ్‌లో 1.64-అంగుళాల AMOLED టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్ప్లే DCI-P3కు మద్దతు ఇస్తుంది. దీని రిజల్యూషన్ 280×456 పిక్సెల్స్‌గా ఉంది. డిస్ప్లే 2.5D కర్వ్డ్ గ్లాస్‌తో రక్షణ అందివ్వనుంది. వాచ్ బ్లూటూత్ v5.0 కనెక్టివిటీతో వస్తుంది. ఇది Android 6.0, iOS 10.0 లేదా అంతకంటే ఎక్కువ OSకి అనుకూలంగా ఉంటుంది. ఫిట్‌నెస్ ట్రాకింగ్‌కు సంబంధించి వాచ్‌లో అనేక ఫీచర్లు అందించారు. ఇది 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. ఇందులో బ్యాడ్మింటన్, క్రికెట్, స్కీయింగ్ కూడా ఉన్నాయి. హార్ట్ రేట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ (SpO2) వంటి ఫీచర్లు కూడా వాచ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇది మీ నిద్ర, గురకను కూడా ట్రాక్ చేస్తుంది. ఇది 50 మీటర్ల లోతు నీటిలోనూ సాఫీగా పనిచేస్తుంది.

Oppo వాచ్ ఫ్రీ 230mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 రోజుల వరకు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. వాచ్ యొక్క కొలతలు 46×29.7×10.6mmకాగా, బరువు 33 గ్రాములు ఉంది. ప్రస్తుతం ఇది సింగిల్ కలర్‌లో లభిస్తుంది.

Also Read: Twitter New Feature: ట్విట్టర్‌లో సరికొత్త పీచర్‌… అక్షరాల పరిమితికి ఇక హద్దులుండవ్‌..

JIO Users: జియో సేవలకు అంతరాయం.. ఆ సర్కిల్‌లో కాల్‌ కనెక్ట్‌ కావడం లేదు..?