Oppo Diwali Sale: దీపావళికి జిగేల్‌మనే సేల్‌.. ఒప్పో ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌..

|

Oct 11, 2024 | 4:51 PM

ఎంపిక చేసిన ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌తో పాటు క్యాష్‌బ్యాక్‌లను సైతం అందిస్తోంది. ఈ క్రమంలోనే ఒప్పో ఫైండ ఎన్‌3 ఫ్లిప్‌ ఫోన్‌పై భారీ డీల్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌పైనోకాస్ట్ ఈఎంటై, జీరో డౌన్‌ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీ, ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ అందించున్నట్లు ఒప్పో ప్రకటించింది. ఈ సేల్‌ ఇప్పటికే ప్రారంభం కాగా నవంబర్‌ 7వ తేదీ వరకు కొనసాగనుంది...

Oppo Diwali Sale: దీపావళికి జిగేల్‌మనే సేల్‌.. ఒప్పో ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌..
Oppo Diwali Sale
Follow us on

దసరా సీజన్‌లో భాగంగా ఈ కామర్స్‌ సంస్థలన్నీ భారీగా ఆఫర్లను అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దీపావళి పండుగ నేపథ్యంలో మరిన్ని ఆఫర్లతో కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఒప్పో యూజర్లకోసం అదిరిపోయే సేల్‌ను అందిస్తోంది. భారత్‌లో దీపావళి సేల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తోంది.

ఎంపిక చేసిన ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌తో పాటు క్యాష్‌బ్యాక్‌లను సైతం అందిస్తోంది. ఈ క్రమంలోనే ఒప్పో ఫైండ ఎన్‌3 ఫ్లిప్‌ ఫోన్‌పై భారీ డీల్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌పైనోకాస్ట్ ఈఎంటై, జీరో డౌన్‌ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీ, ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ అందించున్నట్లు ఒప్పో ప్రకటించింది. ఈ సేల్‌ ఇప్పటికే ప్రారంభం కాగా నవంబర్‌ 7వ తేదీ వరకు కొనసాగనుంది.

పే జీరో, వర్రీ జీరో, విన్‌ రూ. 10 లక్షలు.. పేరుతో దీపావళి సేల్‌ను ఒప్పో తీసుకొచ్చింది. సేల్‌లో భాగంగా ఒప్పో రెనూ 12 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్‌27 ప్రో+ 5జీ ఫోన్లపై 12 నెలల నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను అందించనున్నారు. కోటక్‌ బ్యాంక్‌, టీవీఎస్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీబీ ఫైనాన్స్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్ కస్టమర్లకు ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు జీరో ప్రాససింగ్‌ ఫీ, ఏడాది పాటు జీరో డౌన్‌ పేమెంట్‌ ఆప్షన్స్‌ను అందిస్తారు.

అలాగే హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, బీఓబీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌, కోటక్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, డీబీఎస్‌, ఫెడరల్‌ బ్యాంక్‌లకు చెందిన వారికి 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను అందించనున్నారు. వీటితో పాటు ఒప్పో బ్రాండ్‌కు చెందిన.. ఒప్పో రెనో 11 సిరీస్‌, ఒప్పో ఎఫ్‌25 ప్రో, ఒప్పో ఎఫ్‌27 5జీ, ఒప్పో ఏ3 ప్రో5జీ, ఒప్పో కే12 ఎక్స్‌ 5జీ ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్లు ప్రకటించింది.

ఒప్పో ఫైండ్‌ ఎ3 ఫ్లిప్‌, ఒప్పో ఫైండ్‌ ఎ3 ఫ్లిప్‌, ఒప్పో ఎక్నో బడ్స్‌2, ఒప్పో ప్యాడ్‌ కొనుగోలు చేసిన వారికి రూ. లక్ష గెలుచుకునే అవకాశం కల్పించారు. అయితే నవంబర్‌ 7వ తేదీలోపు కొనుగోలు చేసిన వారికే ఈ అవకాశం. స్క్రీన్‌ ప్రొటెక్షన్‌, ఒప్పో కేర్‌+ సబ్‌స్క్రిప్షన్‌, రివార్డ్‌ పాయింట్లు, క్యాష్‌ ప్రైజ్‌ సొంతం చేసుకునే ఛాన్స్‌ అవకాశం కల్పించారు. ఒప్పో రిటైల్‌ స్టోర్‌, ఒప్పో ఇ స్టోర, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..