చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఏ77 పేరుతో తీసుకొచ్చిన ఈ 4జీ ఫోన్‌ను బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లతో పరిచయం చేసింది. ఇటీవల వరుసగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ వస్తోన్న ఒప్పో తాజాగా ఇలాంటి మరో ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.56 ఇంచెస్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసే ఒప్పో ఏ 77లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందించారు. సూపర్ వూక్ చార్జర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ను కేవలం 5 నిమిసాలు ఛార్జింగ్ చేస్తే మూడు గంటల పాటు కాల్స్ మాట్లాడుకోవచ్చు. 3.5 ఎంఎం ఆడియో జాక్, 4జీ తోపాటు వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీ తదితర ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్ రూ. 17,999గా ఉంది. పలు బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ప్రత్యక్ష ఆకర్షణగా చెప్పాలి. ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. రెయిర్ కెమెరాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను జోడించడం విశేషం. ఇక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని పెంచుకోవచ్చు. శుక్రవారం నుంచి ప్రముఖ ఈ కామర్స్ సైట్స్‌తో పాటు, ఓప్పో స్టోర్‌లలో అందుబాటులోకి వచ్చాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..