Oneplus 10r 5g: భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త ఫోన్‌.. ఆఫర్‌లో భాగంగా ఏకంగా రూ. 7 వేలకిపైగా డిస్కౌంట్‌..

|

Sep 25, 2022 | 8:22 AM

Oneplus 10r 5g: వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ మొబైల్‌ మార్కెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటున్న వన్‌ప్లస్‌ మొన్నటి వరకు.. లో బడ్జెట్‌ ఫోన్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే...

Oneplus 10r 5g: భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త ఫోన్‌.. ఆఫర్‌లో భాగంగా ఏకంగా రూ. 7 వేలకిపైగా డిస్కౌంట్‌..
Oneplus 10r 5g
Follow us on

Oneplus 10r 5g: వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ మొబైల్‌ మార్కెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటున్న వన్‌ప్లస్‌ మొన్నటి వరకు.. లో బడ్జెట్‌ ఫోన్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ కంపెనీ ప్రీమియం ఫోన్‌ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్‌ 10ఆర్‌ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌ భారత్‌లో తాజాగా అందుబాటులోకి వచ్చింది. 5జీ నెట్‌వర్క్‌తో పనిచేసే ఈ స్మోర్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను తీసుకొస్తారు. ఇంతకీ ఈ ఫోన్‌ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.?లాంటి వివరాలపై ఓ లుక్కేయండి..

వన్‌ప్లస్‌ 10 ఆర్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.7 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ + అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్‌ రిష్రెష్‌ రేట్‌ 120 హెర్ట్జ్‌తో ఉండడంతో క్లారిటీ బాగా ఉంటుంది. ఇక స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ కోసం 2.5డీ కర్వ్‌డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందించారు. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీకి ప్రాధానత్య ఇచ్చారు. ఇందులో 150 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే.. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 38,999గా ఉంది. అయితే ప్రస్తుతం అమెజాన్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 32,999కి అందుబాటులో ఉంది. అలాగే ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. 1500 తగ్గింపు లభిస్తుంది. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా అమెజాన్‌ ఈ ఆఫర్‌ను అందిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..