One Plus Nord CE2: బడ్జెట్‌ ఫోన్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసిన వన్‌ప్లస్‌.. తక్కువ ధరలో మరో స్మార్ట్‌ ఫోన్‌..

One Plus Nord CE2: వన్‌ప్లస్‌ బ్రాండ్ పేరు వినగానే భారీ బడ్జెట్‌ ఫోన్‌లే మదిలో మెదులుతాయి. ఈ బ్రాండ్‌ నుంచి విడుదలయ్యే ఫోన్‌లన్నీ ఎక్కువ ధరలో ఉంటాయనే అభిప్రాయం ఉంటుంది. అయితే ఇటీవల తక్కువ బడ్జెట్‌ స్మార్ట్‌...

One Plus Nord CE2: బడ్జెట్‌ ఫోన్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసిన వన్‌ప్లస్‌.. తక్కువ ధరలో మరో స్మార్ట్‌ ఫోన్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 03, 2022 | 6:26 PM

One Plus Nord CE2: వన్‌ప్లస్‌ బ్రాండ్ పేరు వినగానే భారీ బడ్జెట్‌ ఫోన్‌లే మదిలో మెదులుతాయి. ఈ బ్రాండ్‌ నుంచి విడుదలయ్యే ఫోన్‌లన్నీ ఎక్కువ ధరలో ఉంటాయనే అభిప్రాయం ఉంటుంది. అయితే ఇటీవల తక్కువ బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌ల తయారీపై వన్‌ప్లస్‌ గురిపెట్టింది. వరుసగా లో బడ్జెట్‌ ఫోన్‌లను లాంచ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈకు కొనసాగింపుగా వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ2లైట్‌ను తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.

గతేడాది విడుదల చేసిన 5జీ బడ్జెట్‌ ఫోన్‌కు కొనసాగింపుతా ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే రూ. 20 వేల నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఈ ఫోన్‌ ఫీచర్లు ఇవేనంటటూ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోన్న వార్తల ఆధారంగా ఈ ఫోన్‌లో ఉండే ఫీచర్లు ఇవే.. 6.59 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ ప్లూయిడ్‌ డిస్‌ప్లేను అందించనున్నట్లు సమాచారం.

ఇక ఆండ్రాయిడ్‌ 12 ఆక్సిజెన్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 చిప్‌సెట్‌తో పనిచేయనుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగాపిక్సెల్‌తో పాటు 2, 2 ఎంపీలతో కూడిన రెయిర్‌ ట్రిపుల్‌ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్‌ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో కూడిన 33 వాట్స్‌ ఛార్జ్‌ సపోర్ట్‌ చేయనుంది.

Also Read: Anantapur district: విదేశీయుడికి తెలుగువారి మంచి మనసు చాటి చెప్పిన ఆటోడ్రైవర్..

Facebook: ఫేస్‌బుక్‌కు చెమటలు పట్టిస్తున్న టిక్‌టాక్, యూట్యూబ్.. విషయం ఏంటంటే..?

IPL 2022: అతను వికెట్ తీస్తే రూ. 1.66 కోట్లు.. గతేడాది టాప్ ప్లేస్‌లో నిలిచిన ఆర్‌సీబీ బౌలర్.. ఈ ఏడాది మాత్రం..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా