WhatsApp: మరో ఆకట్టుకునే ఫీచర్ తెచ్చే యోచనలో వాట్సాప్.. డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ సమయాన్ని..
WhatsApp: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లలో వాట్సాప్ ముందు వరసులో ఉంటుంది. టెక్ మార్కెట్లో ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్ పుట్టుకొస్తున్న వాట్సాప్ ఇప్పటికే ఏమాత్రం తగ్గని జనాదరణతో దూసుకుపోతోంది...
WhatsApp: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లలో వాట్సాప్ ముందు వరసులో ఉంటుంది. టెక్ మార్కెట్లో ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్ పుట్టుకొస్తున్న వాట్సాప్ ఇప్పటికే ఏమాత్రం తగ్గని జనాదరణతో దూసుకుపోతోంది. దీనికి వాట్సాప్ తీసుకొచ్చే ఫీచర్లే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంత క్రేజ్ దక్కిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాట్సాప్ ఇలా తీసుకొచ్చిన వినూత్న ఫీచర్లలలో డిలీట్ ఎవ్రీ వన్ ఫీచర్ ఒకటి. ఈ ఫీచర్ సహాయంతో పొరపాటున ఎవరికైనా మెసేజ్ పంపిస్తే వెంటనే డిలీట్ చేసే అవకాశం దక్కుతుంది. తాజా సమాచారం ప్రకారం వాట్సాప్ ఈ సమయాన్ని మరింత పెంచనున్నట్లు తెలుస్తోంది.
మెసేజ్ పంపించిన వ్యక్తి తన ఫోన్‌లో డిలీట్ చేస్తే ఎదుటి వ్యక్తికి కూడా డిలీట్ అయ్యే అవకాశం ఈ డిలీట్ ఎవ్రీ వన్ ఫీచర్ ప్రత్యేకత. అయితే ఇప్పటి వరకు ఈ అవకాశం కేవలం గంట వరకు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే మెసేజ్ పంపించిన గంట వరకు డిలీట్ చేస్తేనే ఇతరులకు డిలీట్ అయ్యే అవకాశం ఉంది. కానీ వాట్సాప్ తీసుకురానున్న కొత్త ఫీచర్‌తో ఈ సమయం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
డబ్ల్యూఏబీటా ఇన్ఫోలో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ సమయాన్ని రెండు రోజులకు మించి ఇంకా చెప్పాలంటే వారం రోజులకు పొడగించనున్నారని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ వార్త నిజమే అయితే వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ వచ్చినట్లే అని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Also Read: Smartphone Tips: ఇలా చేస్తే మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.. ఏం చేయాలంటే..
Mahaan Trailer: అదరగొట్టిన తండ్రీకొడుకులు.. విక్రమ్ ‘మహాన్’ ట్రైలర్ వచ్చేసింది!