AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone Tips: ఇలా చేస్తే మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.. ఏం చేయాలంటే..

మంచి బ్యాటరీ లైఫ్‌ని అందించే ఫోన్‌ని కొనుగోలు చేయడం తెలివైన పని అయినప్పటికీ, బ్యాటరీ పనితీరు మీరు దాన్ని ఉపయోగించే విధానంపై ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ పనితీరు మీరు ఉపయోగించే..

Smartphone Tips: ఇలా చేస్తే  మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.. ఏం చేయాలంటే..
Smartphone Battery Backup
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2022 | 4:33 PM

Share

మంచి బ్యాటరీ లైఫ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను గుర్తించడం చాలా కష్టం.. గుర్తించినా అది చాలా ఖరీదైనదిగా ఉంటుంది. ఎక్కువ mAh రేటింగ్‌లు ఉన్న బ్యాటరీలు కలిగిన ఫోన్‌ల కోసం తరచుగా చూస్తారు. మంచి బ్యాటరీ లైఫ్‌ని అందించే ఫోన్‌ని కొనుగోలు చేయడం తెలివైన పని అయినప్పటికీ, బ్యాటరీ పనితీరు మీరు దాన్ని ఉపయోగించే విధానంపై ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ పనితీరు మీరు ఉపయోగించే ఇంటర్నెట్ తోపాటు మరికొన్ని అనవసరమైన యాప్ వల్ల కూడా బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోవచ్చు. ఎలా ఉపయోగించాలి..? ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వాలి..? అనేవాటిని తెలుసుకుందాం..

లైవ్ వాల్‌పేపర్ వినియోగం: లైవ్ వాల్‌పేపర్‌లు యాప్‌లు, థీమ్‌లు మీ ఫోన్‌లో చూడటానికి చక్కగా కనిపిస్తాయి. ఈ వాల్‌పేపర్‌లు మీ ఫోన్‌ని ఆకర్షణీయంగా కనిపించేలా చేసినప్పటికీ.. అది చాలా పవర్ తినేస్తుంటింది. లైవ్ వాల్‌పేపర్‌లు లేదా యానిమేటెడ్ చిత్రాలను ఉపయోగించడం ఆపేయండి.  బదులుగా స్టాటిక్ వాల్‌పేపర్‌లను ఎంచుకోండి. ప్రాధాన్యంగా ముదురు రంగులో ఉన్నవి సహాయపడతాయి.

స్క్రీన్ లైట్ తగ్గించండి: తరచుగా మన స్క్రీన్ లైటింగ్ ఎక్కువగా పెట్టుకుంటాం. ఇది మరింత  శక్తిని వినియోగించే మరొక భాగం. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లు ఆటోమేటిక్‌గా బ్రైట్‌నెస్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి, ఇది స్క్రీన్ బ్రైట్‌నెస్‌ని లైటింగ్ స్థాయిలకు ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. మీరు ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేస్తే, అది మీ ఫోన్ బ్యాటరీ జీవితాన్ని పొడిగించడంలో మీకు సహాయపడవచ్చు. మీరు స్క్రీన్ లైటింగ్ మాన్యువల్‌గా కూడా సెట్ చేయవచ్చు.

Wi-Fi, బ్లూటూత్ లేదా NFCని నిలిపివేయండి: మీరు ఉపయోగంలో లేనప్పుడు Wi-Fi, బ్లూటూత్ లేదా NFCని నిలిపివేయడం ద్వారా బ్యాటరీని ఆదా చేయవచ్చు. మీ మొబైల్ డేటా ఆన్ చేయబడి ఉంటే లేదా మీ ప్రాంతంలో పేలవమైన నెట్‌వర్క్ ఉంటే.. అది పని చేస్తూనే ఉంటుంది. సమీప నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది సాపేక్షంగా ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తుంది. కాబట్టి Wi-Fi, బ్లూటూత్ , NFC వంటి ఫీచర్లు అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయడం ఉత్తమం.

పుష్ నోటిఫికేషన్‌ను నియంత్రించడం: నోటిఫికేషన్‌లు బ్యాటరీని కూడా ఉపయోగిస్తాయి. మీ ఫోన్ బీప్, ఆన్ అయినప్పుడు నోటిఫికేషన్ పాప్ అప్ అవుతుంది. కొన్నిసార్లు, ఫోన్ వైబ్రేటింగ్‌ను అలానే వదిలివేస్తారు. ఇది అదనపు బ్యాటరీని వినియోగిస్తుంది. ఈ సెట్టింగ్‌లన్నీ బ్యాటరీని ఉపయోగిస్తాయి. ప్రత్యేకించి మీకు చాలా నోటిఫికేషన్‌ల్లను తగ్గించుకోవడం ఉత్తమం.  అంతేకాకుండా, అవసరం లేని  యాప్‌ల నుంచి వచ్చే నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి. లేదంటే మీ ఫోన్ వైబ్రేట్ మోడ్‌ను ఆఫ్ చేయవచ్చు లేదా తక్కువ వాల్యూమ్‌లో ఉంచవచ్చు.

బ్యాటరీ హాగ్ యాప్‌లను నిలిపివేయండి: ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు అది ఎంత బ్యాటరీని ఉపయోగిస్తున్నారో చెక్ చేయడం మంచిది. నిర్దిష్ట అప్లికేషన్ ఎక్కువ బ్యాటరీని ఉపయోగిస్తుంటే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవచ్చు. అలాగే, మనం యాప్‌లను ఉపయోగించినప్పుడు .. వాటిని సరిగ్గా ఆఫ్ చేయనప్పుడు, అవి ఆన్ అవుతాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆన్ చేసి ఉంటాయి దీంతో మన ఫోన్ లోని ఇంటర్నెట్ తోపాటు బ్యాటరీ కూడా నష్టపోతాము.

బ్యాటరీ ప్యాక్‌ని కొనుగోలు చేయండి: పై చిట్కాలను అనుసరించిన తర్వాత కూడా ఫోన్ బ్యాటరీ లైఫ్‌లో ఎటువంటి మెరుగుదల లేకుంటే మీరు పవర్ బ్యాంక్ ని కొనుగోలు చేయాలి. ఇది బ్యాటరీ ప్యాక్‌లు పోర్టబుల్, మీ బ్యాగ్ లేదా జేబులో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా తీసుకెళ్లేందుకు ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి: Funny Video: ఈ బాతు పిల్లల సరదా సందడి చూస్తే మీ చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి.. ఈ వీడియోకు ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్..

RBI Recruitment 2022: ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా.. చివరి తేదీ ఎప్పుడంటే..