OnePlus Wireless NeckBand: అదిరిపోయే సౌండింగ్‌తో వన్‌ప్లస్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్.. కేవలం 10నిమిషాల చార్జింగ్‌తో 20 గంటల బ్యాటరీ లైఫ్..

| Edited By: Janardhan Veluru

Aug 21, 2023 | 5:51 PM

ఈ వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ జెడ్2 ఏఎన్సీ నెక్ బ్యాండ్ 45డీబీ హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో వస్తుంది. దీని ద్వారా ఎటువంటి డిస్టర్బెన్స్ లేని సౌండింగ్ తో పాటు కాల్స్ కూడా మాట్లాడే వీలు కల్పిస్తుంది. దీనిలో 12.4ఎంఎం డైనమిక్ డ్రైవర్, టైటానియమ్ కోటెడ్ డోమ్ ఉంటుంది. ఇవి డీప్ బేస్, శక్తివంతమైన బీట్స్ తో అత్యద్భుత క్లారిటీని అందిస్తుంది.

OnePlus Wireless NeckBand: అదిరిపోయే సౌండింగ్‌తో వన్‌ప్లస్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్.. కేవలం 10నిమిషాల చార్జింగ్‌తో 20 గంటల బ్యాటరీ లైఫ్..
Oneplus Bullets Wireless Z2 Anc Neckband
Follow us on

సంగీత ప్రియులకు శుభవార్త. భూమి బద్ధలయ్యే సౌండింగ్ తో పాటు అదిరిపోయే క్లారిటీతో టాప్ టెక్ బ్రాండ్ వన్ ప్లస్ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ ను లాంచ్ చేసింది. అది కూడా కేవలం రూ. 2,299లకే తీసుకొచ్చింది. దీనిపేరు వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ జెడ్2 ఏఎన్సీ నెక్ బ్యాండ్. అత్యాధునిక కట్టింగ్ ఎడ్జ్ నాయిస్ కాన్స్ లేషన్ టెక్నాలజీతో పాటు అత్యద్భుత సౌండ్ క్లారిటీ, అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలోనే మంచి సౌండ్ క్లారిటీని అనుభవించాలనుకొనే వారికి ఇది బెస్ట్ చాయిస్. ఈ వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ జెడ్2 ఏఎన్సీ నెక్ బ్యాండ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అత్యాధునిక నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీ..

ఈ వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ జెడ్2 ఏఎన్సీ నెక్ బ్యాండ్ 45డీబీ హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో వస్తుంది. దీని ద్వారా ఎటువంటి డిస్టర్బెన్స్ లేని సౌండింగ్ తో పాటు కాల్స్ కూడా మాట్లాడే వీలు కల్పిస్తుంది. దీనిలో 12.4ఎంఎం డైనమిక్ డ్రైవర్, టైటానియమ్ కోటెడ్ డోమ్ ఉంటుంది. ఇవి డీప్ బేస్, శక్తివంతమైన బీట్స్ తో అత్యద్భుత క్లారిటీని అందిస్తుంది. అలాగే యాంటీ డిస్టార్షన్ ఆడియో టాక్నాలజీ తో స్మూత్, డిస్టార్షన్ ఫ్రీ ఆడియో అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

20 గంటల బ్యాటరీ జీవితం..

కంపెనీ చెబుతున్న దాని ప్రకారం వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ జెడ్2 ఏఎన్సీ నెక్ బ్యాండ్ 28 గంటలు బ్యాటరీ జీవితాన్ని అందిస్తుందని ప్రకటించింది. అదే ఏఎన్సీ(యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్) వినియోగిస్తే 20 గంటల పాటు పనిచేస్తుందని పేర్కొంది. అంతేకాక కేవలం పది నిమిషాల్లోనే 20 గంటలపాటు వినియోగించుకోవచ్చని వివరించింది.

దీనిలో బ్లూటూత్ 5.2 ఉంటుంది. అలాగే గేమర్స్ కోసం లో లేటెన్సీ డ్యూయల్ ట్రాన్స్ మిషన్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే చర్మానికి ఇబ్బంది కలిగించకుండా ఉండే విధంగా దీని పైన మెటీరియల్ ఉంది. స్పీకర్స్ చివర ఉండే అయస్కాంతం మీకు ఇబ్బందిలేని వినియోగాన్ని అందిస్తుంది.

ధర లభ్యత..

ఈ వైర్ లెస్ నెక్ బ్యాంక్ ధర రూ. 2,299కే లభిస్తోంది. దీనిని వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్, వన్ ప్లస్ స్టోర్ యాప్, వన్ ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్, ఇతర పర్ట్ నర్ స్టోర్లతో పటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రా వంటి ఈ-కామర్స్ ప్లాట్ ఫారంపై కూడా కొనుగోలు చేయొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..