One Plus 11 5G: వన్ ప్లస్ 11 5జీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ తో మార్కెట్ లోకి….

| Edited By: Anil kumar poka

Dec 20, 2022 | 4:54 PM

ఫిబ్రవరి 7న నిర్వహించే క్లౌడ్ 11 ఈవెంట్ వన్ ప్లస్ 11 5జీ ఫోన్ ను ప్రవేశపెడతామని అధికారికంగా వెబ్ సైట్ లో టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ధర విషయంలో ఎలాంటి అప్ డేట్ ఇవ్వనప్పటికీ తన పాత సిరీస్ కు అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

One Plus 11 5G: వన్ ప్లస్ 11 5జీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ తో మార్కెట్ లోకి….
Oneplus 11
Follow us on

వన్ ప్లస్ ఫోన్..స్మార్ట్ ఫోన్ యూజర్ల కలల బ్రాండ్.. ఇందులో వచ్చే కెమెరా క్లారిటీ మిగిలిన ఏ ఫోన్ లోనూ ఉండదనే పేరు..అందుకు తగినట్టుగా కంపెనీ కూడా కెమెరా, డిజైన్ల పరంగా ముందుకెళ్తుంది. మిగిలిన కంపెనీలు కూడా వన్ ప్లస్ ఫోన్ రిలీజ్ చేసిన ఫోన్ల మోడల్స్ నే ఫాలో అవుతయంటే అది అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకూ వివిధ సెగ్మెంట్లలో తన మోడల్స్ ను ప్రవేశపెట్టిన వనప్లస్ కంపెనీ తాజాగా వన్ ప్లస్ 11 5జీ తో మార్కెట్ లోకి వస్తామని ప్రకటించింది. 

ఫిబ్రవరి 7న నిర్వహించే క్లౌడ్ 11 ఈవెంట్ వన్ ప్లస్ 11 5జీ ఫోన్ ను ప్రవేశపెడతామని అధికారికంగా వెబ్ సైట్ లో టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ధర విషయంలో ఎలాంటి అప్ డేట్ ఇవ్వనప్పటికీ తన పాత సిరీస్ కు అటూ ఇటుగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ 100 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని తెలుస్తోంది. అలాగే 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఈ మొబైట్ 6.7 అంగుళా డిస్ ప్లే, 120 Hz ప్యానెల్ తో రానుంది. ఇప్పటి వరకూ వచ్చిన కొన్ని లీక్స్ బట్టి ఈ ఫోన్ ధర రూ.66,999 గా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ టీజర్ లో వన్ ప్లస్ 11 ప్రో గురించి వెల్లడించలేదు. 

వన్ ప్లస్ బడ్స్ ప్రో 2 రిలీజ్

అయితే ఈ క్లౌడ్ 11 ఈవెంట్ లోనే వన్ ప్లస్ బడ్స్ ను రిలీజ్ చేయనుంది. వన్ ప్లస్ బడ్స్ ప్రో 2 పేరుతో ఇవి మార్కెట్ అందుబాటులో ఉండనున్నాయి. క్రిస్టల్ క్లారిటీతో స్టీరియో క్వాలిటీ ఆడియో ఎక్స్ పీరియన్స్ ఇవి యూజర్లకు అందించనున్నాయి. ఈ ఇయర్ బడ్స్ రూ.10,000 వరకూ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..