Youtube: వార్నీ.. యూట్యూబ్ వీడియోలతో ఇంత సంపాదిస్తున్నారా.? భారతీయుల ఒక్క ఏడాది ఆదాయం ఎంతో తెలిస్తే..
యూట్యూబ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ వీడియోలు చూసే యూజర్లు కొందరైతే వీడియోలు పోస్ట్ చేస్తూ డబ్బులు సంపాదించే వారు మరికొందరు. అందరికీ ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్‌ల వినియోగం పెరగడంతో..
యూట్యూబ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ వీడియోలు చూసే యూజర్లు కొందరైతే వీడియోలు పోస్ట్ చేస్తూ డబ్బులు సంపాదించే వారు మరికొందరు. అందరికీ ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్‌ల వినియోగం పెరగడంతో యూట్యూబ్ వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే యూట్యూబర్స్ ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. తాజాగా నివేదిక ప్రకారం 2021 ఒక్క ఏడాదిలోనే యూట్యూబ్ ద్వారా కంటెంటర్లు ఏకంగా రూ. 10 వేల కోట్లకుపైగా సంపాదించారు. ఇది దాదాపు 7.5 లక్షల ఉద్యోగుల వేతనంతో సమానం.
యూట్యూబ్ నివేదిక ప్రకారం 2021లో భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్స్ భారీగా సంపాదించారని తెలిపింది. వచ్చే ఏడాదిలో కంటెంట్ క్రియేటర్స్ కోసం కొత్త ఫీచర్లను విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. యూట్యూబ్ సౌత్ ఈస్ట్ ఏషియా డైరెక్టర్ అజయ్ విద్యాసాగర్ మాట్లాడుత.. ‘యూట్యూబ్ వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని కొనసాగించడంలో సహాయపడుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. యూట్యూబ్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యూట్యూబ్ సహాయంతో భారతీయులు రూపొందించిన వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు. భారత్‌లోని చాలా మందికి యూట్యూబ్ గొప్ప ఆదాయ వనరుగా మారింది. దీంతో చాలా మంది తమ అభిరుచిని కెరీర్‌గా మార్చుకుంటున్నారు’ అని చెప్పుకొచ్చారు.
ఇక ఇదే విషయమై యూట్యూబ్ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ మాట్లాడుతూ ‘యూట్యూబ్ వ్యూయర్స్‌కి మరింత సమాచారాన్ని అందించే క్రమంలో మేము పెట్టుబడులు పెడుతున్నాము. దీని ద్వారా యూజర్లను తమ సామర్థ్యాలను పెంచుకోగలరు’ అని చెప్పుకొచ్చారు. తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఉన్న కెమెరాలు అందుబాటులోకి రావడంతో క్రియేటర్లు వీడియోలను సులభంగా క్రియేట్ చేస్తున్నారు. మంచి కాన్సెప్ట్‌తో వీడియోలను రూపొందిస్తూ భారీగా సంపాదిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..