Google: గూగుల్ లో మీ ఫోన్ నంబర్, అడ్రస్ ఉన్నాయా..? అవి దుర్వినియోగం కాకుండా ఇలా తొలగించండి..

|

Apr 29, 2022 | 8:04 AM

Google: ఒకే ఒక్క ఫోన్‌ నంబర్‌ చాలు మీ జీవితాన్ని మార్చేయడానికి. సైబర్‌ నేరగాళ్లు(Cyber Crimes) మీపై వల వేయడానికి ఈ వివరాలు చాలు. ఇలాంటి వాటి నుంచి వచ్చే ప్రమాదాలను తప్పించుకోవటానికి ఇలా చేయండి..

Google: గూగుల్ లో మీ ఫోన్ నంబర్, అడ్రస్ ఉన్నాయా..? అవి దుర్వినియోగం కాకుండా ఇలా తొలగించండి..
Follow us on

Google: ఒకే ఒక్క ఫోన్‌ నంబర్‌ చాలు మీ జీవితాన్ని మార్చేయడానికి. సైబర్‌ నేరగాళ్లు(Cyber Crimes) మీపై వల వేయడానికి ఈ వివరాలు చాలు. ఏదైనా అమ్మాయికి సంబంధించిన సెల్ నంబర్(Mobile Number) దొరికితే ఇక అంతే సంగతులు. దీనికి తోడు సదరు మహిళ అడ్రస్‌ తోడైతే ఇంకేమైనా ఉందా? ఇలాంటి వ్యక్తిగత వివరాలు గూగుల్‌లో వెతికితే చాలా మందికి సంబంధించిన వివరాలు దొరుకుతుంటాయి. వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అవ్వకుండా ఉండేందుకు.. ఫోన్‌ నంబర్లు, అడ్రస్ లాంటి వివరాలను తొలగించాలని గూగుల్‌ను చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి విజ్ఞప్తుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. దీంతో యూజర్ల ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న గూగుల్‌.. వారి వ్యక్తిగత వివరాలైన ఫోన్‌ నంబర్లు, చిరునామా వంటి వాటిని తొలగించేందుకు అంగీకరించింది.

ఇప్పటి వరకు ఆర్థిక నేరాలకు ఆస్కారం కల్పించే బ్యాంకు అకౌంట్‌, క్రెడిట్‌ కార్డు వివరాలను మాత్రమే తొలగించాలని గూగుల్‌ను వినియోగదారులు రిక్వెస్ట్ అందుబాటులో ఉంది. అలాంటి వివరాలను మాత్రమే గూగుల్‌ తొలగించేది. తాజాగా.. గూగుల్‌ తన పాలసీని సవరించింది. ఫోన్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను కూడా గూగుల్‌ సెర్చ్‌ నుంచి తొలగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు గూగుల్‌ తన బ్లాగ్‌స్పాట్‌లో తెలిపింది. ఈ వెసులుబాటు ఉందని తెలియడంతో అనేక మంది నుంచి పెద్ద ఎత్తున రిక్వెస్ట్ లు రావటం ప్రారంభమయ్యాయి.

గూగుల్‌ సెర్చ్‌లో వ్యక్తిగత వివరాలు తొలగించాలని గూగుల్‌ను కోరినప్పుడు.. మీరు చేసిన విజ్ఞప్తిపై గూగుల్‌ తన వెబ్‌పేజీలన్నింటినీ ఫిల్టర్ చేసి ఆ వివరాలను తొలగిస్తుంది. అయితే.. మీ వ్యక్తిగత వివరాలు ఏదైనా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంటే మాత్రం దాన్ని గూగుల్‌ తొలగించదు. గూగుల్‌ ఈ వివరాలను కేవలం గూగుల్‌ సెర్చ్‌లో నుంచి మాత్రమే తొలగిస్తుంది. ఇంటర్నెట్‌ నుంచి పూర్తిగా సమాచారం తొలగిపోదు. ఎందుకంటే గూగుల్‌ తరహాలో చాలా సెర్చింజిన్లు ఉన్నాయి. వాటి సెర్చ్‌ రిజల్ట్‌లో ఆ సమాచారం కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్‌ నంబర్‌ ఉన్న వెబ్‌సైట్‌ను సంప్రదించి వ్యక్తిగత వివరాలను తొలగించాలని కోరడం మంచిదని గూగుల్‌ సైతం సూచిస్తోంది.

ఇవీ చదవండి..

Anand Mahindra: మస్క్ ట్విట్టర్ కొనుగోలుపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోల్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

Hyderabad: హైదరాబాద్ వినియోగదారుడికి ఎయిర్‌టెల్ షాక్.. బిల్లు చూసి దిమ్మతిరిగి ఏంచేశాడంటే..