Nokia C32: నోకియా నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. రూ. 10వేలలో 50 ఎంపీ కెమెరా.

|

May 22, 2023 | 6:30 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం నోకియా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. మొన్నటి వరకు ప్రీమియం స్మార్ట్‌ ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోన్న నోకియా తాజాగా మార్కెట్లోకి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. నోకియా సీ32 పేరుతో లాంచ్‌ చేయనున్న ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్స్‌ను అందిస్తోంది...

Nokia C32: నోకియా నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. రూ. 10వేలలో 50 ఎంపీ కెమెరా.
Nokia C32
Follow us on

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం నోకియా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. మొన్నటి వరకు ప్రీమియం స్మార్ట్‌ ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోన్న నోకియా తాజాగా మార్కెట్లోకి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. నోకియా సీ32 పేరుతో లాంచ్‌ చేయనున్న ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్స్‌ను అందిస్తోంది. రూ. 10 వేల బడ్జెట్‌లో మంచి ఫీచర్లను అందిస్తున్నారు. త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ స్మార్ట్‌ ఫక్షన్‌ ఫీచర్లు, ధరలాంటి వివరాలు మీకోసం..

నోకియా సీ32 స్మార్ట్‌ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ రెజల్యూషన్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందిచంఆరు. గ్లాక్‌ బ్యాక్‌ అండ్‌ మెటాలిక్‌ ఫినిష్‌ను అందించారు. యునిఎస్‌ఓసీ ఎస్‌సీ 9863 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో వర్చువల్‌గా 3జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. బీచ్ పింక్, చార్కోల్, అటమ్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 10 వాట్స్‌కి సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఇక నోకియా సీ32 స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్‌ 5.2 ఫీచర్‌ను అందించారు. టైప్‌ సీ ఛార్జింగ్ పోర్ట్‌ను అందించారు. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మే 23వ తేదీన భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. ఫేస్‌బుక్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను కూడా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..