దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రాగా త్వరలోనే దేశంలోని మిగతా నగరాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నోకియా కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. నోకియా జీ60 పేరుతో లాంచ్ చేయనున్న ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి పీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత ఉండే అవకాశం ఉంది.? లాంటి పూర్తి వివరాలు..
ఈ స్మార్ట్ ఫోన్‌లో 20Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించనున్నారు. కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
Be ready for tomorrow with a 120Hz refresh rate, a 50MP triple AI camera, high-speed 5G connectivity and years of hardware and software support on the new Nokia G60 5G.
Pre-booking with exclusive offers, coming soon.#NokiaG605G #TomorrowisHere #Nokiaphones #LoveTrustKeep pic.twitter.com/pgrEe2IqqM
— Nokia Mobile India (@NokiamobileIN) October 28, 2022
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. 5జీ, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే నోకియా జీ60 5జీ స్మార్ట్ ఫోన్‌లో యూరప్‌లో 346 యూరోలుగా ఉంది. అయితే భారత మార్కెట్లోకి మాత్రం ఈ ఫోన్‌ను రూ. 19,999 నుంచి రూ. 22,999 మధ్యలో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..